రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. వచ్చే నెల 18న ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్లోనే ఉంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే మహాచండీయాగానికి ప్రణబ్ హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ప్రతి ఏడాది వేసవి, శీతాకాల విడిదికి రాష్ట్రపతి హైదరాబాద్కు రావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది వేసవిలో ప్రణబ్ హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది శీతాకాల విడిదిని ఆయన అనారోగ్య కారణాల వల్ల రద్దు చేసుకున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో ఆయనను పలు రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతారు.