ఎస్సై కమ్యూనికేషన్ సవరించిన ఫలితాలు విడుదల
సాంకేతిక సమస్య వల్లే పొరపాటు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పె క్టర్ (ఎస్సై) కమ్యూనికేషన్, పీటీ వో తుది పరీక్ష ఫలితాల విడు దలలో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వైఫల్యం బయటపడింది. గణితం పరీక్ష మార్కులను కలప కుండానే శుక్రవారం ఫలితాలు ప్రకటించడం అభ్యర్థులను నిర్ఘా ంతపరిచింది. అభ్యర్థులు బోర్డు కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయ డంతో పొరపాటును గుర్తించిన అధికారులు... తొలుత విడుదల చేసిన ఫలితాలను రద్దు చేశారు. గణితం మార్కులు కలిపి ఫలి తాలను ఆదివారం ప్రకటించా రు.
సోమవారం ఉదయం 11 నుంచి వెబ్సైట్ ద్వారా మార్కు ల జాబితాను డౌన్లోడ్ చేసుకో వాలని, సందేహాలుంటే ఆగస్టు 5 నుంచి 9 వరకు ఓపెన్ చాలెంజ్ ద్వారా పరిశీలించుకోవాలని బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు సూచించారు. తుది ఫలితాల్లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గణితం మార్కులు అనుసం ధానం కాలేదని, దీన్ని గుర్తించి మళ్లీ ఫలితాలు ప్రకటించామని డీజీపీ అనురాగ్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. పోలీసు కమ్యూ నికేషన్, పీటీవో విభాగాల్లో 29 ఎస్సై పోస్టులకు గత నవంబర్లో తుది పరీక్ష నిర్వహించారు.