woes
-
బాబు వచ్చె.. రైతన్నకు తిప్పలు తెచ్చె: వైఎస్సార్సీపీ ట్వీట్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో అన్నదాతలు ఐదేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. ఎక్స్(ట్విటర్) ఖాతాలో రైతన్నల ప్రస్తుత పరిస్థితిపై బుధవారం(ఆగస్టు7) ఒక వీడియో పోస్టు చేసింది.ఐదేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు!నరసరావుపేటలో వరి విత్తనాల కోసం వర్షంలోనూ బారులు తీరిన రైతన్నలు. జేజేఎల్ విత్తనాల టోకెన్ల కోసం తప్పని తిప్పలు @ysjagan గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల సహాయ, సహకారంతో ఐదేళ్లు దర్జాగా వ్యవసాయం చేసిన రైతన్నలు బాబు పాలన వచ్చింది..… pic.twitter.com/Z3suYFBQPc— YSR Congress Party (@YSRCParty) August 7, 2024నరసరావుపేటలో ఓ పక్క జోరు వాన పడుతుంటే వరి విత్తనాల టోకెన్ల కోసం రైతన్నలు బారులు తీరిన వైనాన్ని వీడియోలో కళ్లకుకట్టింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నపుడు రైతు భరోసా కేంద్రాల సహాయ సహకారంతో ఐదేళ్లు రైతన్నలు దర్జాగా వ్యవసాయం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. బాబు పాలన వచ్చింది.. తిప్పలు తెచ్చిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. -
జియో విధ్వంసం:75వేల ఉద్యోగాలు మటాష్!
సాక్షి, ముంబై: భారత టెలికాం పరిశ్రమలో సంచలనాలకు నాంది పలికిన రిలయన్స్ జియోకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్. ముఖ్యంగా ఉచిత సేవలతో ప్రత్యర్థికంపెనీలకు దడ పుట్టించిన జియో మరో విధ్వంసానికి కూడా కారణమైంది. కంపెనీల ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో 75వేల ఉద్యోగాలు హుష కాకి అయిపోయాయి. అంతేకాదు జియో ప్రభావం మరింత ప్రమాదకరంగా ఇక ముందు పెరిగే అవకాశంఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఉపాధి లేక రోడ్డున పడే ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశీయ టెలికం కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఎకనామిక్ టైమ్స్ అందించిన రిపోర్ట్ ప్రకారం గత ఏడాది మూడు లక్షలమంది ఉద్యోగులను వివిధ టెలికాం కంపెనీలు నియమించుకోగా వీరిలో 25శాతం మందిపై వేటు పడిందని పేర్కొంది. దీంతో ఉద్యోగుల సంఖ్య 2.25 లక్షలకు కుంచించుకుపోగా పరిశ్రమనువదిలి వెళుతున్న 30శాతం మంది మిడిల్ మేనేజ్మెంట్ విభాగంవారు వుండటం గమనార్హం. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఒత్తిడి, పోటీతత్వంతో టెలికాం ఆపరేటర్లు అల్లకల్లోమవుతున్నారని, టవర్ బిజినెస్, ఆస్తులు అమ్ముకుంటున్నాయని నివేదించింది. మరోవైపు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ కమిటీ అందించిన సమాచారం ప్రకారం 2017 జనవరి-ఏప్రిల్ మధ్యకాంలం 1.5 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. అలాగే టెలికాం రంగం రానున్న కాలంలో మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనుందని రిక్రూట్మెంట్ కంపెనీలు కూడా భావిస్తున్నాయి. ఇక ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని తేల్చి చెపుతున్నాయి. కాగా పరిశ్రమలోకి జియో ఎంట్రీ ఇవ్వడంతో టెలికాం రంగం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దిగ్గజ కంపెనీలన్నీ ఉక్కిరి బిక్కిరవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన వైర్లెస్ సేవలకు స్వస్తి చెప్పింది. దీనికి తోడు ఐడియా, వొడాఫోన్, ఎయిర్టెల్ తమ టవర్ల వ్యాపారాన్ని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
'24' నిర్మాత సంచలన నిర్ణయం
చెన్నై: పైరసీ భూతం చలన చిత్రసీమను పట్టిపీడిస్తోంది. పైరసీ వెబ్ లో చిక్కుకున్న పరిశ్రమ ఎనలేని నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుండగా.. చాప కింద నీరులా పైరసీ భూతం విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బెంగళూరులో '24 ' సినిమా విడుదల రోజే పెద్ద ఎత్తున పైరసీ సీడీలు పట్టుబడటం ఆందోళకు దారి తీసింది. పైరసీకి వ్యతిరేకంగా దృఢమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్రా నిర్మాత జ్ఞానవేల్ రాజా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా చిత్రపరిశ్రమ ముందుకు వచ్చి సంబంధిత చర్యలు తీసుకోవాలని రాజా కోరారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాననీ, పరిశ్రమ సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చిందని రాజా మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమ స్పందించి, సరైన చర్యలు చేపట్టేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రముఖ డిజిటల్ సినిమా ప్రొవైడర్ క్యూబ్, ద్వారా జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమా చట్టవిరుద్ధంగా బెంగళూరు పీవీఆర్ ఓరియన్ మాల్ లో మే 6 న 9.45 గంటలకు షో ( విడుదలైన మొదటి రోజు) సమయంలో రికార్డు చేయబడిందని ఆరోపించారు. ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా తాము దీన్ని గుర్తించామని రాజా ఆరోపించారు. ప్రతి థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్ ద్వారా ఇలా గుర్తించడం సాధ్యమని పేర్కొన్నారు. కాగా తమిళ స్టార్ హీరో సూర్య, విక్రం కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయగా, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. టైం మిషన్ బ్యాక్ గ్రౌండ్తో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్:విజయమ్మ
-
పరిశ్రమలకు మళ్లీ కరెంట్ కష్టాలు