సాక్షి,తాడేపల్లి: ఏపీలో అన్నదాతలు ఐదేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది. ఎక్స్(ట్విటర్) ఖాతాలో రైతన్నల ప్రస్తుత పరిస్థితిపై బుధవారం(ఆగస్టు7) ఒక వీడియో పోస్టు చేసింది.
ఐదేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు!
నరసరావుపేటలో వరి విత్తనాల కోసం వర్షంలోనూ బారులు తీరిన రైతన్నలు. జేజేఎల్ విత్తనాల టోకెన్ల కోసం తప్పని తిప్పలు @ysjagan గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల సహాయ, సహకారంతో ఐదేళ్లు దర్జాగా వ్యవసాయం చేసిన రైతన్నలు
బాబు పాలన వచ్చింది..… pic.twitter.com/Z3suYFBQPc— YSR Congress Party (@YSRCParty) August 7, 2024
నరసరావుపేటలో ఓ పక్క జోరు వాన పడుతుంటే వరి విత్తనాల టోకెన్ల కోసం రైతన్నలు బారులు తీరిన వైనాన్ని వీడియోలో కళ్లకుకట్టింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు రైతు భరోసా కేంద్రాల సహాయ సహకారంతో ఐదేళ్లు రైతన్నలు దర్జాగా వ్యవసాయం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. బాబు పాలన వచ్చింది.. తిప్పలు తెచ్చిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment