governmet
-
బాబు వచ్చె.. రైతన్నకు తిప్పలు తెచ్చె: వైఎస్సార్సీపీ ట్వీట్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో అన్నదాతలు ఐదేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. ఎక్స్(ట్విటర్) ఖాతాలో రైతన్నల ప్రస్తుత పరిస్థితిపై బుధవారం(ఆగస్టు7) ఒక వీడియో పోస్టు చేసింది.ఐదేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు!నరసరావుపేటలో వరి విత్తనాల కోసం వర్షంలోనూ బారులు తీరిన రైతన్నలు. జేజేఎల్ విత్తనాల టోకెన్ల కోసం తప్పని తిప్పలు @ysjagan గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల సహాయ, సహకారంతో ఐదేళ్లు దర్జాగా వ్యవసాయం చేసిన రైతన్నలు బాబు పాలన వచ్చింది..… pic.twitter.com/Z3suYFBQPc— YSR Congress Party (@YSRCParty) August 7, 2024నరసరావుపేటలో ఓ పక్క జోరు వాన పడుతుంటే వరి విత్తనాల టోకెన్ల కోసం రైతన్నలు బారులు తీరిన వైనాన్ని వీడియోలో కళ్లకుకట్టింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నపుడు రైతు భరోసా కేంద్రాల సహాయ సహకారంతో ఐదేళ్లు రైతన్నలు దర్జాగా వ్యవసాయం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. బాబు పాలన వచ్చింది.. తిప్పలు తెచ్చిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. -
భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. 1984, డిసెంబర్ 2,3 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ గ్యాస్ లీక్ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రజలు నాటి ఘటన మిగిల్చిన విషాదాన్ని దిగమింగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ ఉదంతపు గాయాలు 39 ఏళ్లు గడిచినా మానలేదు. ఈ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతిచెందారు. వారి పిల్లలు, మనుమలు ఇప్పటికీ ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం ఎందుకూ సరిపోలేదు. నాడు గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో విషపూరిత వ్యర్థాలు నేటికీ కనిపిస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ దుర్ఘటనకు బలై, న్యాయ పోరాటానికి దిగిన చాలామంది ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ ఉదంతంలో బాధ్యులను శిక్షించాలనే అంశం ఇంకా కోర్టుల్లో పెండింగ్లోనే ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 15 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దరిమిలా నగరం మృతదేహాలతో నిండిపోయింది. 1979లో మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి కోసం ఇక్కడ ఒక కర్మాగారం ఏర్పాటయ్యింది. అయితే ఈ పరిశ్రమ యాజమాన్యం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి ఫ్యాక్టరీలోని ఏ 610 నంబర్ ట్యాంక్లో నీరు లీకైంది. మిథైల్ ఐసోసైనేట్లో నీరు కలవడంతో ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగింది. ఆ తర్వాత విషవాయువు వాతావరణంలోకి వ్యాపించించింది. 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ వాయువు నగరమంతటా వ్యాపించింది. ఈ విషవాయువుల బారినపడి 15 వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు కూడా విష వాయువు ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వైకల్యం రూపంలో వారిని, వారి తరాలను వెంటాడుతోంది. ఈ విష వాయువు ప్రభావంతో మరణించిన వారి అధికారిక సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. అధికారిక మరణాల సంఖ్య మొదట్లో 2259గా నివేదించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 3,787 మంది గ్యాస్ బారిన పడినట్లు నిర్ధారించింది. ఇతర అంచనాల ప్రకారం ఎనిమిది వేల మంది మరణించారు. మరో ఎనిమిది వేల మంది గ్యాస్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: రెబల్స్, స్వతంత్రుల టచ్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు? -
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 582 మార్కులు సాధించాను..!
-
రాజ్యాధికార సాధనే తారకంకు నివాళి
తెనాలి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీరాభిమాని అయిన బొజ్జా తారకం తన జీవితకాలమంతా పీడితజన హక్కుల కోసం పోరాటం చేశారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దుడ్డు ప్రభాకర్ చెప్పారు. ప్రముఖ న్యాయవాది, దళిత, పీడిత ప్రజల హక్కుల కోసం కషి చేసిన బొజ్జా తారకం సంస్మరణ సభ గురువారం సాయంత్రం ఇక్కడి కవిరాజ పార్కులోని వీజీకే భవన్లో నిర్వహించారు. టి.శ్యాంషా అధ్యక్షత వహించారు. మానవహక్కుల వేదిక, మహాత్మాఫూలే, అంబేడ్కర్ విజ్ఞానసమితి, తెనాలి సంయుక్తంగా ఏర్పాటుచేసిన సభలో ప్రభాకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పీడిత కులాల ప్రజల హక్కుల కోసం బయట సమాజంలో, న్యాయస్థానంలో పోరాడిన యోధుడు తారకం అన్నారు. దళిత మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరుగా దళితమహాసభ అధ్యక్షుడిగా దళితుల పక్షాన రాజీలేని పోరాటం చేసినట్టు గుర్తుచేశారు. సాంకేతిక విద్యాశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ బత్తుల పున్నయ్య మాట్లాడుతూ దళిత బహుజనులు ఏకమై అంబేడ్కర్ ఆయుధంగా రాజ్యాధికారానికి రావాలనీ, అదే తారకంకు ఇచ్చే నివాళిగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్, డివిజనల్ అధ్యక్షుడు దేవరపల్లి వీరయ్య తన ప్రసంగంలో చుండూరు కేసు న్యాయపోరాటంలో తారకం చేసిన కషిని వివరించారు. మానవ హక్కుల వేదిక జిల్లా కో–కన్వీనర్ అమర్తలూరి రత్నప్రసాద్, గురివిందపల్లి వేమయ్య, జీఎస్ నాగేశ్వరరావు ప్రసంగించారు.