దొంగలు ఈడ్చుకుంటూ వెళ్లినా వదల్లేదు
చందానగర్: గొలుసు స్నాచింగ్‌కు యత్నిం చిన దొంగలను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె తీవ్రగాయాలకు గురైంది. వివరాలు... సురక్షహిల్స్‌కు చెందిన రాధాబాయి శుక్రవారం ఉదయం 7 గంటలకు వాకింగ్‌కు వెళ్లింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన రాధాబాయి వారిని ప్రతిఘటించింది.
దీంతో తోకముడిచిన దొంగలు పారిపోతుండగా రాధాబాయి వారి బైక్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో దొంగలు ఆమెను చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి రాధాబాయి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఎంతో ధైర్యంగా స్నాచర్లను ఎదుర్కొని గొలుసును కాపాడుకున్న ఆమెను అభినందించారు.