woman attempt suicide
-
భర్త, పిల్లలు దూరమయ్యారనే మనస్తాపంతో..
సాక్షి, నిజాంసాగర్(నిజామాబాద్): భర్త, పిల్లలు దూరమయ్యారని కలత చెందిన మన్నె వినోద(28) బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పెట్రోలింగ్ పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురం గ్రామానికి విక్రమ్,వినోద దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భార్య నుంచి దూరంగా విక్రమ్ తన ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. గడిచిన ఆరు ఏళ్ల నుంచి పిల్లలు, భర్త దూరం అయ్యాడని మానసిక వేదనకు గురై వినోద ఆత్మహత్య చేసుకునేందుకు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చింది. అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులకు వినోద ఒంటరిగా కన్పించింది. అనుమానంతో పోలీసులు వినోదను విచారించగా నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చాని చెప్పడంతో ఆమెను పోలీసులు పట్టుకున్నారు. కుటుంబీకులకు సమాచారం అందించి ఆమెను బంధవులకు అప్పగించారు. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్సై హైమద్ అభినందించారు. చదవండి: దారుణం: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం -
రైలు వెళ్లిపోయింది-మహిళ బతికింది
-
రైలు పట్టాలపై పడింది, ప్రాణాలతో లేచింది
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ ఎప్పటిలానే ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో అక్కడికో యువతి వచ్చింది. రైలు కూత వినిపించగానే ... ఆమె టక్కున పట్టాలపై దూకేసింది. అతి వేగంగా వచ్చిన రైలు, అంతే స్పీడ్‌గా యువతిపై నుంచి వెళ్లిపోయింది. రైలు పట్టాలపై నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ యువతికి ఏమైంది? బతికే ఉందా లేక ... జరగరానిది ఏదైనా జరిగిందా? అయితే భయపడ్డట్టుగా ఏమీ కాలేదు. రైలు వెళ్లిపోగానే, మంచంపై నుంచి లేచినట్టు చక్కగా లేచింది. ఈలోగా, అక్కడే ఉన్న ఓ అబ్బాయి...ఆమెకు చేయి ఇవ్వగానే ... ఎంచక్కా ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేసింది. అసలు ఈ యువతి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? అసలిదంతా సూసైడా లేక కొత్త రకం స్టంటా? ఆ అబ్బాయి ఎవరు? ఇవన్నీ గ్రేట్ మిస్టరీలు. ఢిల్లీ మెట్రో స్టేషన్ సిసి కెమెరాల్లో నమోదు అయిన దృశ్యాలు రేపిన కలకలం ఇది. ప్రస్తుతం యూట్యూబ్‌లో హిట్స్‌పై హిట్స్ కొడుతోందీ ఫుటేజ్. ఢిల్లీ స్లమ్ ఏరియాలో నివసిస్తున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకునేందుకే రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు సీఐఎస్ఎఫ్ డీఐజీ ఉదయ్ బెనర్జీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పది ఆత్మహత్యాయత్నాలు జరిగాయాని... అయితే ఈ ఘటన నుంచి యువతి బతికి బయటపడటం మిరాకిల్ అన్నారు.