ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నిజాంసాగర్(నిజామాబాద్): భర్త, పిల్లలు దూరమయ్యారని కలత చెందిన మన్నె వినోద(28) బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పెట్రోలింగ్ పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురం గ్రామానికి విక్రమ్,వినోద దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భార్య నుంచి దూరంగా విక్రమ్ తన ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. గడిచిన ఆరు ఏళ్ల నుంచి పిల్లలు, భర్త దూరం అయ్యాడని మానసిక వేదనకు గురై వినోద ఆత్మహత్య చేసుకునేందుకు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చింది.
అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులకు వినోద ఒంటరిగా కన్పించింది. అనుమానంతో పోలీసులు వినోదను విచారించగా నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చాని చెప్పడంతో ఆమెను పోలీసులు పట్టుకున్నారు. కుటుంబీకులకు సమాచారం అందించి ఆమెను బంధవులకు అప్పగించారు. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్సై హైమద్ అభినందించారు.
చదవండి: దారుణం: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment