ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ ఎప్పటిలానే ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో అక్కడికో యువతి వచ్చింది. రైలు కూత వినిపించగానే ... ఆమె టక్కున పట్టాలపై దూకేసింది. అతి వేగంగా వచ్చిన రైలు, అంతే స్పీడ్‌గా యువతిపై నుంచి వెళ్లిపోయింది. రైలు పట్టాలపై నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ యువతికి ఏమైంది? బతికే ఉందా లేక ... జరగరానిది ఏదైనా జరిగిందా? అయితే భయపడ్డట్టుగా ఏమీ కాలేదు. రైలు వెళ్లిపోగానే, మంచంపై నుంచి లేచినట్టు చక్కగా లేచింది. ఈలోగా, అక్కడే ఉన్న ఓ అబ్బాయి...ఆమెకు చేయి ఇవ్వగానే ... ఎంచక్కా ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేసింది. అసలు ఈ యువతి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? అసలిదంతా సూసైడా లేక కొత్త రకం స్టంటా? ఆ అబ్బాయి ఎవరు? ఇవన్నీ గ్రేట్ మిస్టరీలు. ఢిల్లీ మెట్రో స్టేషన్ సిసి కెమెరాల్లో నమోదు అయిన దృశ్యాలు రేపిన కలకలం ఇది. ప్రస్తుతం యూట్యూబ్‌లో హిట్స్‌పై హిట్స్ కొడుతోందీ ఫుటేజ్. ఢిల్లీ స్లమ్ ఏరియాలో నివసిస్తున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకునేందుకే రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు సీఐఎస్ఎఫ్ డీఐజీ ఉదయ్ బెనర్జీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పది ఆత్మహత్యాయత్నాలు జరిగాయాని... అయితే ఈ ఘటన నుంచి యువతి బతికి బయటపడటం మిరాకిల్ అన్నారు.
Published Tue, Oct 1 2013 1:09 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement