Delhi metro railway station
-
నేడు పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైన్
సాక్షి, న్యూఢిల్లీ: మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా మన దేశంలో పట్టాలెక్కనుంది. ఈ రైలు సర్వీసును ప్రధాని మోదీ 28న ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ –బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీనితోపాటు ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సేవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభిస్తారు. ఈ ఆవిష్కరణలు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని అధికారులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ నెట్వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుందన్నారు. సోమవారం మెజెంటా లైన్లో డ్రైవర్‌లెస్ సర్వీసులు ప్రారంభమైన తరువాత, 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్లో డ్రైవర్‌లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. -
రైలు వెళ్లిపోయింది-మహిళ బతికింది
-
రైలు పట్టాలపై పడింది, ప్రాణాలతో లేచింది
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ ఎప్పటిలానే ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో అక్కడికో యువతి వచ్చింది. రైలు కూత వినిపించగానే ... ఆమె టక్కున పట్టాలపై దూకేసింది. అతి వేగంగా వచ్చిన రైలు, అంతే స్పీడ్‌గా యువతిపై నుంచి వెళ్లిపోయింది. రైలు పట్టాలపై నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ యువతికి ఏమైంది? బతికే ఉందా లేక ... జరగరానిది ఏదైనా జరిగిందా? అయితే భయపడ్డట్టుగా ఏమీ కాలేదు. రైలు వెళ్లిపోగానే, మంచంపై నుంచి లేచినట్టు చక్కగా లేచింది. ఈలోగా, అక్కడే ఉన్న ఓ అబ్బాయి...ఆమెకు చేయి ఇవ్వగానే ... ఎంచక్కా ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేసింది. అసలు ఈ యువతి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? అసలిదంతా సూసైడా లేక కొత్త రకం స్టంటా? ఆ అబ్బాయి ఎవరు? ఇవన్నీ గ్రేట్ మిస్టరీలు. ఢిల్లీ మెట్రో స్టేషన్ సిసి కెమెరాల్లో నమోదు అయిన దృశ్యాలు రేపిన కలకలం ఇది. ప్రస్తుతం యూట్యూబ్‌లో హిట్స్‌పై హిట్స్ కొడుతోందీ ఫుటేజ్. ఢిల్లీ స్లమ్ ఏరియాలో నివసిస్తున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకునేందుకే రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు సీఐఎస్ఎఫ్ డీఐజీ ఉదయ్ బెనర్జీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పది ఆత్మహత్యాయత్నాలు జరిగాయాని... అయితే ఈ ఘటన నుంచి యువతి బతికి బయటపడటం మిరాకిల్ అన్నారు.