మహిళ పట్ల హోంగార్డు అసభ్య ప్రవర్తన
విశాఖపట్టణం: ఓ హోంగార్డు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా పెదగండ్యాడ మండలం నెల్లి ముక్కలలో గురువారం జరిగింది. ఓ హోం గార్డు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ బాధిత మహిళ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ హోంగార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.