రైల్లో మహిళా ఎడిటర్‌కు వేధింపులు..
వరంగల్ : కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పత్రిక మహిళ ఎడిటర్‌ను ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె వారించినా ఆకతాయిలు రెచ్చిపోవటంతో ఈ విషయాన్ని సెల్‌ఫోన్ ద్వారా పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.