woman kill
-
పార్క్‌లో సింహం దాడి.. మహిళ మృతి
జొహాన్నెస్‌బర్గ్: విహార యాత్ర విషాదంగా మారింది. సరదాగా పార్క్‌కు వెళ్లిన యువతి ఆకస్మికంగా సింహం బారినపడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లోని వన్యప్రాణుల పార్క్ చూసేందుకు ఓ అమెరికా యువతి వెళ్లింది. ఈ పార్క్‌లో సింహాలను బంధించకుండా స్వేచ్చగా వదిలేస్తారు. కార్లు, ఇతర వాహానాలలో వెళ్లి వీటిని చూడవచ్చు. అమెరికా యువతి కారులో వెళ్లి సింహాలను చూస్తూ సరదగా ఫొటోలు తీయసాగింది. కాగా ఆ సమయంలో కారు అద్దాలు వేసుకోకపోవడంతో సింహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను రక్షించేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించగా అతణ్ని కాలి గోళ్లతో గాయపరిచింది. పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై సింహాన్ని అక్కడి నుంచి దరిమేశారు. వెంటనే అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అమెరికా యువతి చనిపోగా, డ్రైవర్ చికిత్స పొందతున్నాడు. పార్క్ తిలకించేందుకు వచ్చేవారికి తగిన జాగ్రత్తలు తెలియజేస్తామని, కారు అద్దాలు వేసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పార్క్ సిబ్బంది చెప్పారు. -
సెల్ఫీ డెత్
-
సెల్ఫీ సరదాకు యువతి బలి
లండన్: సెల్ఫీ తీసుకోవడం చాలామందికి సరదా. కానీ జాగ్రత్తలు తీసుకోకుండా సాహసాలు చేస్తే ప్రాణాపాయం తప్పదు. సెల్ఫీ సరదా మరో ప్రాణం తీసింది. రుమేనియాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో విషాదకర రీతిలో మరణించింది. అన్నా ఉర్సు (18) రైలు టాప్‌పైన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడింది. ఆ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయాలని భావించింది. అన్నా తన స్నేహితురాలితో కలసి లాసి పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఇద్దరూ కలసి రైలుపైకి ఎక్కారు. కాగా ఉర్సు హై టెన్షన్ విద్యుత్ కేబుల్‌కు దగ్గరగా వెళ్లడంతో షాక్ కొట్టింది. ఆమె దుస్తులకు మంటలు అంటుకోగా, స్నేహితురాలి రైలుపై నుంచి పడిపోయింది. ఈ సంఘటనను గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రాణాలకు తెగించి వీరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. రైలుపైకి ఆమె దుస్తులపై మంటలను ఆర్పివేశాడు. ఇద్దరు అమ్మాయిలను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉర్సు శరీరం 50 శాతంపైగా కాలిపోవడంతో మరణించింది. ఆమె స్నేహితురాలు చికిత్స పొందుతోంది.