Women’s Asia Cup T20
-
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం
మహిళల ఆసియాకప్-2022లో పాకిస్తాన్ జట్టుకు థాయ్‌లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. షెల్లాట్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తమ టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌పై థాయలాండ్కు ఇదే తొలి విజయం. 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ మరో బంతి మిగిలూండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. థాయ్ ఓపెనర్ నటకన్ చంతమ్ 61 పరుగులు చేసి.. తమ జట్టు చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ బౌలర్లలో నిదా దార్, హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు థాయ్‌లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో అమీన్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక థాయ్ బౌలర్లలో టిప్పోచ్ రెండు, తిపట్చా పుట్టావాంగ్ ఒక్క వికెట్ సాధించారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న భారత్ తలపడనుంది. The sheer happiness after scoring those winning runs ✨The Thailand🇹🇭 Team won our hearts and the match today@ThailandCricket #ACC #AsiaCup2022 #WomensAsiaCup pic.twitter.com/atJwwG7wfh — AsianCricketCouncil (@ACCMedia1) October 6, 2022 చదవండి: IND VS SA: లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై నీలినీడలు -
ఆసియాకప్‌లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం
మహిళల ఆసియాకప్-2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షెల్లాట్ వేదికగా యూఏఈ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ ఆసియాకప్‌లో వరుసగా మూడో విజయాన్ని భారత్ తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(49 బంతుల్లో 64), రోడ్రిగ్స్( 45 బంతుల్లో 75) అర్ధ సెంచరీలతో చెలరేగారు. యూఏఈ బౌలర్లలో గౌర్, మొఘల్, కోట్టి, ఇషా రోహిత్ తలా వికెట్ సాధించారు. ఇక 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లో కవిషా ఎగోడాగే(30 నటౌట్), కుషీ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. కాగా భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ రెండు వికెట్లు, దయాలన్ హేమలత ఒక్క వికెట్ సాధించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్7న తలపడనుంది. చదవండి: LLC 2022: మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ -
ఆసియా కప్ టీ20: ఫైనల్లో భారత్
కౌలాలంపూర్: ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ గ్యాంగ్ తుది పోరుకు అర్హత సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఈ టోర్నీలో నాల్గో విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత్ సగర్వంగా ఫైనల్‌కు చేరింది. అంతకముందు మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక జట్లపై భారత్ విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మిథాలీ రాజ్ డకౌట్ నిష్క్రమించడంతో భారత్ పరుగుకే వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ(0) సైతం పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టింది. కాగా,స్మృతీ మంధాన(38), హర్మన్‌ప్రీత్ కౌర్(34 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ ఇంకా 23 బంతులుండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ క్రీడాకారిణుల్లో సనా మిర్(20 నాటౌట్), నహిదా ఖాన్(18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్ ఏక్తా బిస్త్ మూడు వికెట్లతో రాణించగా, శిఖా పాండే, అంజూ పటేల్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. -
పాకిస్థాన్‌తో మ్యాచ్.. చెలరేగిన భారత బౌలర్లు
కౌలాలంపూర్ : మహిళా ఆసియా కప్ టీ-20 సిరీస్‌లో భాగంగా మలేసియాలో దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 73 పరుగుల స్వల్ప లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఇటు భారత్, అటు పాకిస్థాన్ జట్లు చెరో మూడు విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. చావో-రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఏక్తా బిష్త్ తన నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీసుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి పాక్ వుమెన్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టడానికి నానాతంటాలు పడ్డారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత మహిళా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ.. పాక్ జట్టును 72 పరుగులకు పరిమితం చేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి.. భారత్ జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరే అవకాశం కనిపిస్తోంది.