women blackmail
-
స్వీట్‌గా మాట్లాడి క్లోజ్ అవుతారు.. కలవాలని ఉందని చెప్పి..
కృష్ణరాజపురం: ప్రభుత్వ టెండర్ పేరిట మహిళా గ్యాంగ్ ఒకటి నగరంలోని పారిశ్రామికవేత్త కుమారుడిని కిడ్నాప్ చేసి డబ్బులను దోచుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు.. కర్నాటకకు చెందిన రవి అనే పారిశ్రామికవేత్త కుమారుడు సూరజ్. వీరు బ్యాటరాయనపుర ప్రాంతంలో రవి ఇండ్రస్టియల్ సప్లయ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. టెండర్ ఇప్పిస్తానని.. సూరజ్‌కు ప్రభుత్వ పనుల టెండర్ ఇప్పిస్తానని పుష్పలత అనే మహిళ నాలుగు సార్లు కలిసింది. శ్రీ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్టు అధ్యక్షురాలిగా పరిచయం చేసుకున్న పుష్పలత పలుమార్లు సూరజ్‌ను హనీట్రాప్ చేయాలని చూసింది. సంతోష్ అనే వ్యక్తిని సూరజ్‌కు పరిచయం చేసి ఇతడు ఐఏఎస్ అధికారి పీఏ అని, టెండర్ ఇప్పిస్తాడని నమ్మబలికింది. ఆ తర్వాత మరో ఇద్దరిని పరిచయం చేసింది. అపహరించి రూ.4 కోట్లు డిమాండ్ సూరజ్ నుంచి ఎలాగైనా డబ్బు వసూలు చేయాలని మూడురోజుల క్రితం అతడిని కిడ్నాప్ చేశారు. రూ. 4 కోట్లు ఇవ్వాలని లేదంటే నీపై అత్యాచారం కేసు పెడతామని పుష్ప, సంతోష్, అయ్యప్ప అలియాస్ అర్జున్, రాకేశ్‌లు పిస్టల్ చూపి బ్లాక్మెయిల్ చేశారు. అంత డబ్బులు లేవని, తనను వదిలిపెట్టాలని సూరజ్ బతిమాలుకున్నాడు. అయినా నిందితులు వినకపోవడంతో ఆ తర్వాత తన స్నేహితుడు గురుమూర్తికి కాల్ చేసి రూ.25 లక్షల నగదును అందజేయగా పుష్పలత వదిలిపెట్టింది. సూరజ్ బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా బుధవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: మేఘనా సర్జా రెండో పెళ్లి? ఆమె ఏమందంటే? -
పెళ్లి పేరుతో 'పెద్దాయన'ను దోచేశారు
అహ్మదాబాద్: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ 50 ఏళ్ల వ్యక్తిని దారుణంగా మోసం చేశారు ముగ్గురు మహిళలు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఆ ముగ్గురు మహిళలని, మరో వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన పర్సోత్తమ్ మార్వియా అనే వ్యక్తికి 50 ఏళ్లు. అతడికి ఐదుగురు సంతానం కూడా. వారిలో ఇద్దరు కొడుకులు.. ముగ్గురు కూతుర్లు. మూడేళ్ల క్రితం అతడికి భార్య చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా కలసి అతడికి ఓ తోడు కోసం మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పెళ్లి ప్రకటన కూడా ఇచ్చారు. ఇక మంజుల అలియాస్ మోనా వాఘెలా(37), డైసీ మక్వాన్ (45), షీలా క్రిస్టియాన్(54) అనే మహిళలు ఘరానా కిలాడీలు. వీరికి తోడు మైఖెల్ జోసెఫ్(25) అనే మరో మోసగాడు. వీరిలో పర్సోత్తమ్ పరిస్థితి తెలుసుకున్నఅతడికి ఎర వేశారు. గ్యాంగ్‌లోని షీలా... పర్సోత్తమ్కు మంచి సంబంధం చూసి పెడతానని అహ్మదాబాద్‌కు రావాలని ఆహ్వానించింది. అక్కడ తొలుత అతడికి ముగ్గురు మహిళలను చూపించింది. అయితే వారిలో ఏ ఒక్కరూ అతడికి నచ్చక వద్దని వెళ్లాడు. మరోసారి ఫోన్ చేసి పిలిపించి ఇద్దరు మహిళలని చూపించింది. ఆ ఇద్దరిలో మంజుల కూడా ఉంది. అయితే, ఆమెను వారిని కూడా అతడు రిజెక్ట్ చేశాడు. ఈసారి మళ్లీ ఫోన్ చేసి ఏకంగా తానే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసింది షీలా. దీంతో అతడు ఫోన్ పెట్టేయగా మరోసారి ఫోన్ చేసి తాను ఎంతో ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోకుంటే లేఖలో అతడి పేరు రాసి చనిపోతానని బెదిరించింది. బెదిరింపులకు భయపడిన అతడు రాజ్ కోట్ నుంచి తిరిగి అహ్మదాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా అతడికి ఓ గదిని ఏర్పాటుచేసి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మంచినీళ్లలో మత్తుమందును కలిపి ఇచ్చింది. ఓ మహిళతో కలిసి అసభ్యకరంగా ఉన్నట్లుగా అతడిని ఫోటోలు తీశారు. అనంతరం కిలాడీ మహిళలు... పర్సోత్తమ్ ...వేసుకున్న దుస్తులను కూడా వదిలిపెట్టకుండా దోచుకెళ్లారు. అప్పటి నుంచి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారు. ఆ ఫోటోలు ఇచ్చేయాలంటే 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. చివరకు అయిదు లక్షలు ఇచ్చేందుకు పర్సోత్తమ్ అంగీకరించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని అతడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులన్ని ఆశ్రయించడంతో చాకచక్యంగా ఆ ఘరానా ముఠాను అరెస్టు చేశారు.