women fans
-
FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే
మరో మూడురోజుల్లో సాకర్ సమరం మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఈసారి అరబ్ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో జరగనుంది. ఈ మెగా సమరాన్ని వీక్షించేందుకు అన్ని దేశాల అభిమానులు ఇప్పటికే ఖతార్ బాట పట్టారు. అమెరికా, యూకే లాంటి దేశాల నుంచి చాలా మంది అభిమానులు ఖతార్‌కు చేరుకున్నారు. ఇక మ్యాచ్‌లు మొదలయితే ఆ కిక్కు వేరుగా ఉండనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనుంది. దాదాపు నెలరోజులపాటు జరగనున్న ఈ సమరం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ జరిగిన ప్రతీసారి మహిళలు, యువతులు తమ అందచందాలతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతార్‌లో మాత్రం మహిళల అందాల కనువిందు కష్టమే. ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతార్‌లో సంప్రదాయాలకు విలువెక్కువ. మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అభిమానులు ఎలాగైనా రావొచ్చు. లిక్కర్ కూడా అన్లిమిటెడ్. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చే యువతులు, మహిళలు బాడీపార్ట్స్ కనిపించేలా దుస్తులు వేసుకురావడం చూస్తునే ఉంటాం. ఇవన్నీ మిగతా దేశాల్లో నడుస్తుందేమో కానీ ఇస్లాం మతం గట్టిగా ఫాలో అయ్యే అరబ్ దేశాల్లో ఇలాంటివి నిషేధం. వాస్తవానికి అరబ్ దేశాల్లో మద్యపానం బహిరంగ నిషేధం. అయితే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఒక మిడిల్ ఈస్ట్ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండడంతో మరి కటువుగా ఉంటే పరిస్థితులు మారిపోతాయని పసిగట్టిన ఖతార్ దేశం కొన్ని నియమాలను సడలించింది. మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకులు తమతో లిక్కర్ తెచ్చుకుంటే అనుమతిస్తామని ఖతార్ అధికార విభాగం తెలిపింది. అయితే బహిరంగంగా మాత్రం మద్యపానం ఎక్కడా అమ్మరని.. తమతో వచ్చేటప్పుడు తెచ్చుంటే ఎటువంటి అభ్యంతరం లేదని నిర్వాహకులు తెలిపారు. కానీ మ్యాచ్‌కు వచ్చే మహిళలు, యువతులు ధరించే దుస్తులపై మాత్రం కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే మ్యాచ్‌లు వీక్షించడానికి వచ్చే మహిళలు, యువతులు కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. శరీర బాగాలు కనిపించేలా అసభ్యకరమైన దుస్తులు వేసుకొస్తే స్టేడియంలోకి అనుమతించమని.. మాట వినకుంటే జైలుకు పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. అయితే ఫిఫా వెబ్సైట్లో మాత్రం మ్యాచ్ చూడడానికి వచ్చే అభిమానుల డ్రెస్ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ చాయిస్ వారికే వదిలేస్తున్నామని తెలిపింది. కానీ దేశ నిబంధనల ప్రకారం శరీర బాగాలు కనిపించకుండా దుస్తులు వేసుకొని వస్తే మంచిదని పేర్కొంది. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులకు ఈ ఆంక్షలు ఇబ్బంది పెట్టేలాగా ఉన్నప్పటికి ఖతార్ దేశ నిబంధనల మేరకు నడుచుకోక తప్పదు. చదవండి: భారతీయుల అభిమానానికి మెస్సీ ఫిదా.. ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
ఆటోడ్రైవర్‌కు మహిళా అభిమానుల బెడద
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన హీరో రవితేజ ’రాజా ది గ్రేట్’ సినిమాలో చెప్పిన ఓ ఫోన్ నెంబర్ విశాఖకు చెందిన లంకలపల్లి గోపి అనే వ్యక్తిని ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. విసుగెత్తిన అతడు చివరకు తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు కూడా. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితు... అయన బంగ్లాదేశ్ స్టార్ హీరో ఏమీ కాదు. మామూలు ఆటో డ్రైవర్. అతడికి రోజూ వందల మంది మహిళా అభిమానులు ఫోన్ చేస్తున్నారు. అది భరించలేక అతడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అతడేమీ స్టార్ హీరో కాకపోయినా అన్ని ఫోన్లు రావడానికి కారణం మాత్రం బంగ్లాదేశ్ టాప్ హీరో షాకిబ్ ఖాన్. దాంతో తన జీవితాన్ని దుర్భరం చేసిన షాకిబ్ ఖాన్‌పై 50వేల పౌండ్లకు దావా వేయాలని నిర్ణయించుకున్నాడు ఆటోడ్రైవర్ ఇలాజుల్ మియా. హీరో ఖాన్‌కు, ఇలాజుల్ మియాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇదంతా ఎందుకు జరిగిందంటే.... షాకిబ్ ఖాన్ నటించిన ‘రాజనీతి’ సినిమా ఇటీవల విడుదలయింది. ఈ సినిమాలో హీరోయిన్‌కు షాకిబ్ ఖాన్ ఓ ఫోన్ నెంబర్ తనదంటూ ఇస్తాడు. అది నిజంగా హీరో ఫోన్ నెంబర్ అని హీరో మహిళా అభిమానులు భావించారు. యాదృశ్చికంగా ఆ ఫోన్ నెంబర్ మన ఆటోరిక్షా డ్రైవర్ ఇలాజుల్ మియాది. వందలాది మంది మహిళా ఫ్యాన్... ఆ ఫోన్ నెంబర్ హీరోది అనుకొని ఇలాజుల్ ఫోన్‌కు ఫోన్లు చేస్తూ వస్తున్నారు. అస్తమానం ఫోన్లు రావడంతో అతడికి.. ఇతర మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఇలాజుల్ భార్య అనుమానించింది. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ బెదిరిస్తూ వచ్చింది. ఆమెకే ఫోన్ ఇచ్చి చివరకు ఆ ఫోన్లు హీరోకు వస్తున్న ఫోన్లుగా తెలిసేలా చేసేడు. ప్రస్తుతానికి కొత్తగా పెళ్లయిన వారి మధ్య గొడవ సద్దు మణగింది. ఆయితే ఫోన్లు మాత్రం ఆగడం లేదని ఇలాజుల్ మియా వాపోతున్నాడు. ఓ మహిళా అభిమాని అయితే తానుంటున్న చోటును కనుక్కొని 300 మైళ్ల దూరం నుంచి హీరో కోసం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఓ దశలో తాను ఫోన్ నెంబర్ మార్చుకుందామని అనుకున్నానని, అయితే తనను ఫోన్‌పై పిలిచే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని మార్చుకోలేదన్నాడు. 50వేల పౌండ్లకు కోర్టుకెళ్లి లాయర్ ద్వారా దావా కూడా వేశానని చెప్పాడు. అయితే దాన్ని విచారించేందుకు జడ్జీ స్వీకరించలేదని, ఫోన్ నెంబర్ వల్ల తనకు నిజంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయో, లేదో తెలుసుకునేందుకు దర్యాప్తుకు ఆదేశించారని చెప్పాడు. దర్యాప్తు అనంతరం తన దావాపై విచారణ జరిగే అవకాశం ఉందని అతడు తెలిపాడు. -
'అమ్మాయిల్లో పిచ్చి ఫాలోయింగ్'
ఈ మాట అంటున్నది ఎవరో కాదండోయ్. 180 కేజీల బరువుతో కండలు మెలితిరిగి బలిష్టంగా ఉన్న ఈ గొరిల్లాను చూసి జూకు వచ్చిన అమ్మాయిలంటున్నారు. 18 ఏళ్ల వయసున్న ఈ మగ గొరిల్లా పేరు షబని. నెదర్లాండ్‌లో పుట్టిన ఈ గొరిల్లాను ఆస్ట్రేలియాకు, అనంతరం జపాన్‌లోని నగోయా సిటీ హిగషియామా జూకు తరలించారు. 2007 నుంచి ఇక్కడే ఉంటున్న దీనితో జూ నిర్వహకులు ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్నుంచి దీనికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీనిని చూసేందుకు పెద్దసంఖ్యలో యువతులు జూకు తరలి వస్తున్నారని జూ అధికారి తెలిపారు. ట్విటర్లోనూ షబనీకి తెగ ఫాలోయింగ్ ఉంది.