ఒడిశా అసెంబ్లీలో పరిస్థితులు గందరగోళం
భువనేశ్వర్ : ఒడిశా అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా నిరసనకారులపై పోలీసు ఫోర్స్ చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేటి అసెంబ్లీ సమావేశాలు అట్టుడికాయి. సుందర్ఘర్ జిల్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్వహించిన సమావేశానికి బ్లాక్ స్టోల్స్ను కప్పుకుని వచ్చిన మహిళా నిరసనకారుల స్టోల్స్ను తొలగించడానికి పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారని విపక్షాలు వాపోయాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ సభ పలుమార్లు వాయిదా పడింది. ఈ ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ ఘటనపై ఏ మహిళా ఇప్పటివరకు ఫిర్యాదుచేయలేదని అధికారపక్షం బీజేడీ వాదిస్తోంది.
సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఈ ఘటనకు పట్నాయకే బాధ్యుడంటూ స్లోగన్స్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులైతే ఏకంగా స్పీకర్ పోడియంపైకి ఎక్కి, మైకులను విరగొట్టారు. సభను సజావుగా సాజనిపక్షంలో స్పీకర్ నిరంజన్ పూజారీ మొదట 3 గంటల వరకు వాయిదావేశారు. తిరిగి సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది. దీంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు. మహిళలకు మంచి గౌరవం ఇస్తానని చెప్పే ముఖ్యమంత్రే, తన ర్యాలీలో ఇలాంటి ఘటనలు చేపట్టడం బాధకరమని విపక్షాల చీఫ్ విప్ తార ప్రసాద్ అన్నారు. నల్లరంగు చీరలతో వచ్చిన మహిళలను పట్నాయక్ తన మీటింగ్కు అనుమతించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.