జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్న మహిళలు
వైఎస్సార్ జిల్లా: కడప పట్టణంలోని మరియాపురంలో గురువారం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమాన్ని మహిళలు అడ్డుకున్నారు. రేషన్ సరిగా ఇవ్వడం లేదని, అదే విధంగా పింఛన్లు కూడా రావటం లేదని వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి ముందు మహిళలు తమ గోడు వినిపించారు. స్థానిక టీడీపీ నాయకులు కల్పించుకుని వారం రోజుల్లో పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
టీడీపీ అధికారంలోకి రాగానే సగానికి పైగా పింఛన్లు తీసేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింఛన్లు తొలగించిన మహిళలకు తిరిగి ఇప్పించాలని కోరుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 'జన్మభూమి' కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులకు, టీడీపీ నాయకులకు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు.