Women working
-
Shabnam: పవర్ ఆఫ్ ఉమెన్
జమ్మూలోని దోడా జిల్లాలో ‘ఎలక్ట్రిషియన్’ అంటే మగవాళ్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ‘మహిళా ఎలక్ట్రిషియన్’ అనే మాట, దృశ్యం ఊహకు కూడా అందనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిషియన్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన షబ్నమ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది... జమ్మూ దోడా జిల్లాలోని మారుమూల గ్రామం కహరకు చెందిన షబ్నమ్ పదవ తరగతి పూర్తయిన తరువాత శ్రీనగర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రిషియన్ కోర్సులో డిప్లొమా చేసింది. తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆర్థికంగా అండ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఎలక్ట్రిషియన్‌గా పని మొదలు పెట్టింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. కొద్ది కాలంలోనే షబ్నమ్‌కు ఎలక్ట్రీషియన్‌గా మంచి పేరు వచ్చింది. ‘తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్ట్రిషియన్ వృత్తిలోకి వచ్చాను. అయితే నా పనితీరును చాలామంది మెచ్చుకోవడంతో ఉత్సాహం వచ్చింది. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ ఫీల్డ్‌లోనే పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అంటుంది షబ్నమ్. నిజానికి దోడా ప్రాంతంలో ఎలక్ట్రిషియన్ అంటే మగవాళ్లు మాత్రమే. ‘అమ్మాయిలు ఎలక్ట్రిషియన్‌గా పని చేయడం ఏమిటీ!’ అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసేవాళ్లే. ఈ విషయం తెలిసి కూడా ఎలక్ట్రిషియన్‌గా అడుగులు మొదలుపెట్టింది షబ్నం. ‘ఇది మగవాళ్లు మాత్రమే పనిచేయాల్సిన రంగం. ఇది ఆడవాళ్లు మాత్రమే పనిచేయాల్సిన రంగం అంటూ ఏదీ లేదు’ అంటుంది షబ్నమ్. ఎంటెక్ చదువుకున్న రషీద్‌ఖాన్ జమ్మూలో నిపుణులైన ఎలక్ట్రిషియన్స్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయనున్నాడు. ఖాన్ బృందంలో ఉన్న ఒకే ఒక మహిళ షబ్నమ్. ‘వీరితో ఎలాంటి భయం లేదు. మేమందరం ఒక కుటుంబం’ అంటుంది షబ్నమ్. చాటుమాటుగానే కాదు... ‘అమ్మాయిలు ఎలక్ట్రిషియన్ వర్క్ చేయడం ఏమిటి!’ అని ముఖం మీదే అన్నవాళ్లు ఉన్నారు. అయితే అలాంటి మాటలను షబ్నమ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. ‘ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఇది మహిళలు పనిచేసే రంగం కాదు అనే భావన నుంచి బయటికి రావాలి. ప్రతి రంగంలోనూ మంచి, చెడు ఉంటాయి. చెడును మాత్రమే చూస్తే ఉన్నచోటే ఉండిపోతాం. ప్రతి కొత్త అడుగులో కించపరిచే విధంగా మాట్లాడేవాళ్లు, ప్రతికూలంగా మాట్లాడే వాళ్లు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారికి మన పనితోనే సమాధానం చెప్పాలి’ అంటున్న షబ్నమ్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేయాలనుకునే మహిళలకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది. -
మహిళా శ్రామిక శక్తితోనే దేశాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్ : మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని 131 దేశాల్లో భారత్ 120వ స్థానంలో ఉందని, భారత్ స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి మహిళలు ముందుకు రావాలని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరీన్ హడ్డా అన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన ‘వి హబ్’ప్రథమ వార్షికోత్సవానికి హడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ‘వి హబ్’సానుకూల పురోగతి సాధిస్తుందని కితాబునిచ్చారు. భారత శ్రామిక శక్తిలో మహిళలు కేవలం 24% మాత్రమే ఉన్నారని, వ్యాపారవేత్తలుగా రాణించేందుకు వారు ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలన్నారు. ఆంగ్ల రచయిత్రి జేకే రౌలింగ్ మాటలను ఉటంకిస్తూ.. ‘ప్రపంచాన్ని మార్చేది ఇంద్రజాలం కాదని.. ప్రపంచాన్ని మార్చేది మానవ శక్తి మాత్రమేనని’వ్యాఖ్యానిస్తూ.. అలాంటి శక్తి మహిళలకే ఎక్కువగా ఉందని కేథరీన్ హడ్డా అన్నారు. వివిధ రంగాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపడంలో ‘వి హబ్ ’కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌లు మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. సాధికారతకు బాసటగా మెప్మా పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట్రంలోని 108 మున్సిపాలిటీల్లో 1.24లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారతకు బాసటగా నిలుస్తోందని మెప్మా మిషన్ డైరక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు రూ.2 వేల కోట్లు విలువ చేసే వ్యాపారాలు నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 1700 మహిళా స్వయం సహాయక సంఘాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్ల శ్రీదేవి వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ‘నుమాయిష్’లో ‘వి హబ్’సహకారంతో కొంత మంది మహిళలు 55 స్టాళ్లను ఏర్పాటు చేసిన విషయాన్ని శ్రీదేవి ప్రస్తావించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్శంగా ఏర్పాటు చేసిన ‘వి హబ్’ప్రథమ వార్షికోత్సవానికి సంస్థ సీఈవో దీప్తి రావుల అధ్యక్షత వహించారు. ‘వి హబ్’ద్వారా లబ్ధిపొందిన పలు వురు మహిళా వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచు కున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్శంగా హైదరాబాద్‌లోని ఫారిన్, కామన్వెల్త్ కార్యాలయం నుంచి ఒకరోజు పాటు ‘డిప్యూటీ హై కమిషనర్’గా గుర్తింపుపొందిన యువ మహిళ నయోనిక రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వ్యవసాయంలో పెరిగిన మహిళలు
న్యూఢిల్లీ: 2015–16 సంవత్సరంలో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్రం సోమవారం విడుదల చేసింది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు ఈ లెక్కల్లో తేలింది. వ్యవసాయ గణను ప్రతి ఐదేళ్లకోసారి చేపడతారు. 2010–11లో 12.79 శాతం మంది మహిళా రైతులు ఉండగా, 2015–16 నాటికి 13.87 శాతానికి వారి సంఖ్య పెరిగింది. 2010–11లో సాగుభూమి 159.59 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే 2015–16లో అది 1.53 శాతం తగ్గి 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది. అయితే దేశంలో మొత్తం కమతాల సంఖ్య 5.33 శాతం పెరిగినప్పటికీ సగటు కమతం విస్తీర్ణం మాత్రం తగ్గింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కమతాలు ఉండగా తర్వాతి స్థానాల్లో బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. సాగుభూమి అత్యధికంగా రాజస్తాన్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. కమతాలు అత్యధికంగా పెరిగిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తొలిరెండు స్థానాల్లో ఉన్నాయి. -
మహిళల్ని వ్యక్తులుగా గుర్తిస్తేనే సాధికారత సాధ్యం
స్త్రీలు పనిచేసే కార్యాలయాల్లో క్రెచ్ సెంటర్లు ఉండాలి హోం టు వర్క్‌కు మద్దతిస్తున్నా... మహిళా ఉద్యోగినుల నుంచే ఒత్తిడి రావాలి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలిత కుమారమంగళం డిసెంబర్ నుంచి మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ అభివృద్ధిలో ఇంకా వెనుకబాటు కనిపిస్తోంది. ఈ అసమానతకు కారణం మహిళల్ని సమాజంలో వ్యక్తులుగా గుర్తించకపోవడమే. వారికి అవకాశాలతో పాటు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. క్షేత్ర స్థాయి నుంచి మహిళల స్థితిగతులపై దృష్టిసారించాలి’’ అని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ లలిత కుమారమంగళం పేర్కొన్నారు. బుధవారం జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (ఎన్ఐఆర్డీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘మహిళల ఆలోచనా విధానం మారాలి. ప్రస్తుతం మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నచోట్ల క్రెచ్ సెంటర్లు లేవు. సరైన మౌలిక వసతులు లేకపోవడం బాధాకరం. కుటుంబ పాలన చూసుకోవడంతో పాటు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించడం కష్టమైన పని. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కార్యాలయాల్లో కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో హోం టు వర్క్ అమల్లో ఉంది. ఈ పద్ధతికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ పద్ధతి పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే, ఈ డిమాండ్ మహిళా ఉద్యోగుల నుంచి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వచ్చే రెండేళ్ల కాలంలో గ్రామ పంచాయతీలకు రూ.2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నిధులను గ్రామాల్లో మహిళాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుంది.’ అని అన్నారు. అనంతరం ఓర్వకల్ మహిళా సమాఖ్య సలహాదారు విజయ భారతి మాట్లాడుతూ మహిళల్ని అనుబంధాలతో కట్టిపడేస్తున్నారని, దీంతో స్వేచ్ఛ కోల్పోవడంతో పాటు మానసిక వేదనలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఐఆర్‌డీతో ఒప్పందం: ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న మహిళల పాత్ర పాలనలో కనిపించడం లేదని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ లలిత కుమారమంగళం అభిప్రాయపడ్డారు. వారికి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఎన్‌ఐఆర్‌డీతో జాతీయ మహిళా కమిషన్ ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. డిసెంబర్ నుంచి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని, ముందుగా రాజస్తాన్‌లో కార్యక్రమం ప్రారంభిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ డెరైక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, రిజిస్ట్రార్ చంద్ర పండిట్ తదితరులు పాల్గొన్నారు. -
ఓ మహిళ కన్నీటి కధ