న్యూఢిల్లీ: 2015–16 సంవత్సరంలో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్రం సోమవారం విడుదల చేసింది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు ఈ లెక్కల్లో తేలింది. వ్యవసాయ గణను ప్రతి ఐదేళ్లకోసారి చేపడతారు. 2010–11లో 12.79 శాతం మంది మహిళా రైతులు ఉండగా, 2015–16 నాటికి 13.87 శాతానికి వారి సంఖ్య పెరిగింది. 2010–11లో సాగుభూమి 159.59 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే 2015–16లో అది 1.53 శాతం తగ్గి 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది.
అయితే దేశంలో మొత్తం కమతాల సంఖ్య 5.33 శాతం పెరిగినప్పటికీ సగటు కమతం విస్తీర్ణం మాత్రం తగ్గింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కమతాలు ఉండగా తర్వాతి స్థానాల్లో బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. సాగుభూమి అత్యధికంగా రాజస్తాన్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. కమతాలు అత్యధికంగా పెరిగిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తొలిరెండు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment