లైంగిక వేధింపులను అరికట్టాలి
వేలూరు:మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని రాష్ట్ర మహిళా కమిషనర్ విశాలాక్షి తెలిపారు. వేలూరు కలెక్టరేట్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టడంపై సమీక్ష సమావేశం కలెక్టర్ నందగోపాల్ అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది. విశాలాక్షి మాట్లాడుతూ మహిళలకు తరచూ లైంగిక వేధింపులు రావడం, పనులకు వెళ్లే మహిళలను ఉన్నత అధికారులు ఇబ్బంది పెట్టడం వంటి సమస్యలు తరచూ ఉంటున్నాయన్నారు. వీటిపై మహిళలు ఫిర్యాదు చేసినా సమస్యలు ఇంకా పెద్దవి అవుతాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ముఖ్యమంత్రి జయలలిత 13 అంశా ల పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
ఈ కమిషన్ 2008 సంవత్సరం నుంచి ఉందని సాంఘీక శాఖ ద్వారా వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా, తాలుకా స్థాయిలో వచ్చే ఫిర్యాదులను సంబంధిత పోలీసులు నేరుగా వెళ్లి విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోగలిగితే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. లైంగిక వేధింపుల పై వచ్చే ఫిర్యాదులను పోలీసులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మహిళలకు ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్కు నిర్బయంగా ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఎస్పీ విజయకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కార్తీక్, కమిష న్ సభ్యులు మర్గదం, సూపరింటెండెంట్ భానుమతి, అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.