Womens Education
-
ఆమె అక్షర... లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పాఠశాల విద్య పూర్తి చేయడమే గగనం. అవును నిజం.. కానీ ఇప్పుడది గతం. నేడు అగ్రభాగం ఆమె సొంతం. బడిలో బాలికలదే ముందంజ. ఉన్నత చదువు ల్లోనూ వనితే ఫస్ట్. అక్షరాన్ని ఆయుధంగా భావిస్తున్న నేటి మహిళలు విద్యారంగంలో సత్తా చాటుతున్నారు. ఇంకా ‘సగభాగమేంటి?’.. అంతకు మించే అని గర్వంగా చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏ విశ్వవిద్యాలయాని కెళ్ళినా ప్రవేశాల సంఖ్యలో అమ్మాయిలదే మొదటి స్థానం. వందేళ్ళు దాటిన ఉస్మానియా సహా చాలా వర్సిటీల్లో వారే అధిక సంఖ్యలో ఉన్నారు. సంప్రదాయాల సంకెళ్లు తొలగి అవగాహన, ఆధునికత పెరగడం, దానికి తగినట్టుగా బడులు, కళాశాలలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం, ప్రత్యేక పాఠశాలలు, కాలేజీలు కూడా ఏర్పాటు కావడం, విద్య అవసరం అనే భావన పెంపొందడం..ఇవన్నీ మహిళలను ఉన్నత విద్య వైపు నడిపిస్తున్నాయి. అందుకే ఏ వర్సిటీ చూసినా, ఏ కోర్సు పరిశీలించినా మహిళల శాతమే మెరుగ్గా ఉంటోంది. అబ్బురపరిచే అంకెలు ► ఉస్మానియా వర్సిటీ పరిధిలో లా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, బీఎడ్‌కు సంబంధించిన 20 కాలేజీలుంటే, అందులో 18,763 సీట్లున్నాయి. 2022లో వీటిల్లో 10,897 సీట్లు (58.09 శాతం) అమ్మాయిలే దక్కించుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో 1,599 సీట్లుంటే 1,083 సీట్లు వారివే. పీజీ సెంటర్స్‌లోని 202 సీట్లలో అమ్మాయిల వాటా 107. ► జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 2010–11లో 58 శాతం సీట్లు అబ్బాయిలతో భర్తీ అయ్యాయి. 2022లో సీన్ దాదాపు రివర్స్ అయ్యింది. చేరికల్లో అబ్బాయిలది 45 శాతం అయితే, అమ్మాయిలది 55 శాతం. ► పీజీలోనూ అమ్మాయిలదే హవా. వివిధ కోర్సుల్లో దాదాపు 80 శాతం మహిళలే ఉండటం విశేషం. కరోనా తర్వాత బాలురు ఇంజనీరింగ్, డిగ్రీతో ఉపాధి వైపు వెళ్తుంటే, అమ్మాయిలు మాత్రం పీజీలో చేరుతున్నారు. పరిశోధనల వరకూ వెళ్ళాలి మహిళల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. పోస్టు–గ్రాడ్యుయేషన్ వరకూ ఎక్కడా ఆగకుండా ముందుకెళ్తున్నారు. కానీ రీసెర్చ్ వరకూ వెళ్ళలేకపోతున్నారు. ఆరేళ్ళ వరకూ సమయం వెచ్చించాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉవంచుకుని మహిళలు, వారి తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ విజ్జులత, వీసీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ సాధికారత సాధించాలి విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సామాజిక మార్పులు, ప్రభుత్వాల ప్రోత్సాహం వల్లే సమాజంలో మహిళలు ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలూ పోటీ పడుతున్న తీరు అభినందనీయం. మహిళాలోకం ఇదే స్ఫూర్తితో మరింత ముందడుగు వేయాలి. సాధికారిత సాధించాలి. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులేయాలి విద్యా రంగంలో అనునిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలూ ముందుకెళుతున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణించేలా ప్రస్తుత సమాజ పోకడలను అవగతం చేసుకుంటున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రుల శాతం పెరగడమూ మహిళా విద్యకు ఊతం ఇస్తోంది. ప్రతి మహిళా డిజిటల్ టెక్నాలజీలో మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మా క్యాంపస్‌లో ప్రత్యేక కోర్సును డిజిటల్ టెక్నాలజీలో ప్రవేశపెడుతున్నాం. భవిష్యత్‌లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. – ప్రొఫెసర్ కవిత దార్నా, వీసీ, జేఎన్ఎఫ్ఏ విధాన నిర్ణేతలుగా ఎదగాలి చదువుతో సామాజికంగా మహిళ ఉన్నత శిఖరాలనే అధిరోహిస్తోంది. అయితే క్రిటికల్ జాబ్స్‌లో ఇంకా మహిళకు ఎదురీత తప్పడం లేదు. విధాన పరమైన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఈ పరిస్థితి మారుతుంది. అత్యున్నత పదవుల్లో ఉన్నా మహిళకు ఇంటి బాధ్యతలు తప్పడం లేదు. పురుషాధిక్య మానసిక ధోరణే దీనికి ప్రధాన కారణం. – సూర్యదేవర నీలిమ, సీఈఓ, అనురాగ్ యూనివర్సిటీ -
మహిళావిద్యను ప్రోత్సహించాలి
హైదరాబాద్: మహిళా విద్యను సమాజంలోని అన్ని సంస్థలు ప్రోత్సహించాలని, తద్వారా వారికి మరింత గౌరవం దక్కుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వేదకాలం నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదన్నారు. తార్నాకలో శనివారం జరిగిన సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయ కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఆయన పలువురు విద్యార్థినులకు బంగారు పతకాలు అందజేశారు. మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని, 71 ఏళ్ల భారతావనిలో నేటికి 20% నిరక్షరాస్యత ఉందని, అందులో మహిళల శాతం ఎక్కువగా ఉండటమే బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మహిళల పట్ల వివక్ష, వేధింపులు జరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేడు అన్ని రంగాల్లో మహిళలే ముందున్నట్లు ఆయన చెప్పారు. మహిళా విద్యకు సరోజినీదేవి విద్యా సంస్థలు, ఎగ్జిబిషన్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. నేడు భారతీయులే సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాల సంస్కృతిని అనుసరిస్తే ఆరోగ్యానికి, మన సంస్కృతికి హానీ చేయడమే అవుతుందని హితవు పలికారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో బలోపేతం అవుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు దేశంలో అత్యంత చౌకధరల్లో నాణ్యమైన ఔషధాలు లభిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారిందని, పలు అరుదైన వ్యాధు లు, రోగాల నివారణకు అవసరమైన మందుల కోసం విద్యార్థులు పరి శోధనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వీరేందర్, కళాశాల కార్యదర్శి సుకేష్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. -
సైకిళ్లను పంపిణీ చేసిన జయలలిత
టీనగర్: ఈ ఏడాది 6,44,000 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం చెన్నై సచివాలయంలో ప్రారంభించారు. 2014-15 విద్యా సంవత్సరంలో ప్లస్ ఒన్ చదివే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేశారు. రాష్ట్రంలో మహిళా విద్యను ప్రోత్సహించే విధంగా హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ప్లస్‌ఒన్, ప్లస్‌టూ తరగతులు చదివే ఆదిద్రావిడ షెడ్యూల్ కులాల విద్యార్థినులందరికి సైకిళ్లను అందజేసే పథకం 2001-02లో ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. ఆ తర్వాత 2005-06 సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్లస్‌ఒన్ తరగతులు చదివే అన్ని వర్గాల విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఏడాది ప్రారంభంలోనే విద్యార్థులకు సైకిళ్లు అందజేసే విధంగా 2014-15 సంవత్సరంలో *230 కోట్ల 72 లక్షల ఖర్చుతో 2,86,400 మంది విద్యార్థులు, 3,57,600 విద్యార్థినులు మొత్తం 6,44,000 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేసే విధంగా ఏడుగురు విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం సైకిళ్లను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కేసీ వీరమణి, ఎస్.అబ్దుల్ రహీం, ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్‌సుందర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెరైక్టర్ అశోక్ డోంగ్రే, అధికారులు పాల్గొన్నారు. భక్తుల వసతి గృహం ప్రారంభం తిరుచెందూర్ ఆలయంలో భక్తులు బస చేసే విధంగా వసతి గృహాన్ని, తల నీలాలు సమర్పించేందుకు ప్రత్యేక మండపాన్ని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు.