Womens Football Players
-
యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు సౌమ్య..
Soumya Guguloth: వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్లలో పర్యటించే భారత మహిళల సీనియర్ ఫుట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా వచ్చే నెల 2న యూఏఈతో, 4న ట్యూనిషియాతో, 10న బహ్రెయిన్‌తో, 13న చైనీస్ తైపీతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! -
స్వదేశానికి మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు
జీవితంలో భయంకరమైన రోజు చూశాం: కోచ్ న్యూఢిల్లీ: నేపాల్ భారీ భూకంపం కోరల్లో చిక్కుకున్న భారత మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు ఆదివారం సురక్షితంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అండర్-14 మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు 18 మందితో పాటు ఐదుగురు సహాయక సిబ్బంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ద్వారా ఢిల్లీ విమానాశ్రమానికి చేరుకున్నారు. ఖాట్మండు నుంచి ఎయిర్ క్రాఫ్ట్ సీ-17లో ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు 237 మంది ప్రమాణికులు ఢిల్లీకి చేరుకున్నారు. ‘మా విషమ పరీక్ష పూర్తయింది. మాటల్లో వర్ణించలేనంత ఉపశమనంగా ఉంది. నే పాల్లో శనివారం మా జీవితాల్లోనే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఆ క్షణ కాలం పాటు తిరిగి మా స్వగృహాలకు చేరుకుంటామో, లేదో అన్న అనుమానం తలెత్తింది. చివరికి క్షేమంగా తిరిగి వచ్చాం.’ అని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫుట్‌బాల్ టీం కోచ్ మేమూల్ రాకీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇరాన్‌తో మ్యాచ్ కోసం శనివారం భారత టీం ఖాట్మండ్‌లోని దశరథ్ స్టేడియంలో సాధన చేస్తోంది. ఆ సమయంలోనే ఒక్క సారిగా భూప్రకంపనలు రావడంతో ప్లేయర్లు గ్రౌండ్ మధ్య ఖాళీ ప్రదేశంలోకి పరుగులు పెట్టారు. ఆ సమయంలోనే సమీపంలోని బిల్డింగ్లు తమ కళ్ల ముందే కుప్పకూలి పోయాయి. ఘటనతో భీతిల్లిన ప్లేయర్లు, సహాయక సిబ్బంది వారు బసచేసే హోటల్ గదుల్లో కాక ఆరు బయటే నిద్రపోయారు.