హంపి, హారికల ఓటమి
తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో అజేయంగా ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు శనివారం అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి.
తొమ్మిదో రౌండ్లో హంపి 60 ఎత్తుల్లో బేలా ఖోతెనాష్‌విలి (జార్జియా) చేతిలో; హారిక 48 ఎత్తుల్లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయారు. ఈ టోర్నీలో హంపి, హారికలకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. తొమ్మిదో రౌండ్ తర్వాత హంపి ఆరున్నర పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండ గా... హారిక ఐదున్నర పాయింట్లతో కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్), బేలా ఖోతెనాష్విలిలతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉంది.