Womens Suicides
-
స్వావలంబన: ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు
ఆటో మొబైల్ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ను ప్రారంభించింది... మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. ‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్ జనరల్ మేనేజర్ లవ్లీసింగ్. ఆటోమొబైల్ రంగంలో లవ్లీసింగ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్ రంగానికి సంబంధించి సేల్స్ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్. ‘ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సీమ. 27 సంవత్సరాల గుర్మీత్ ఆటో మొబైల్ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్ ఎంజీ. ఆల్–ఉమెన్ టీమ్ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్ ఇండియా ఎండీ రాజీవ్ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్–ఉమెన్ టీమ్’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
మహిళలకు రక్షణ కవచం ‘దిశ’ యాప్
తిరుపతి (యూనివర్సిటీ క్యాంపస్): విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి. ఎవరికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏమిటి. ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్. దీనిని ఎక్కడి నుంచి.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆపత్కాలంలో ఎలా వినియోగించాలనే విషయాలపై శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఆపద వేళ యువతులు, మహిళలు, విద్యార్థినులను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం మేరకు రూపొందించిన ఈ యాప్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టేననే విషయాన్ని వివరించారు. డౌన్ లోడ్.. ఉపయోగించడం ఇలా ► ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► యాప్‌లోఎస్‌వోఎస్ బటన్ ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్ బటన్ నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ► ఆ వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ► విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. దిశను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మహిళా రక్షణ గురించి సీఎం వైఎస్ జగనన్నకు బాగా తెలుసని, దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టానికి ఆయన రూపకల్పన చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు యాప్‌ను ఎక్కువ మందితో డౌన్లోడ్ చేయించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య మమత, రెక్టార్ ఆచార్య శారద, అడిషనల్ ఎస్పీ సుప్రజ యాప్ ఆవశ్యకతను వివరించారు. సదస్సుకు హాజరైన చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ మహిళా పోలీసులంతా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
అల్లుడి వేధింపులు తాళలేక ముగ్గురు బలవన్మరణం
సాక్షి, చెన్నై: అల్లుడి వేధింపులు తాళలేక ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా కార్యాపట్టి కీలవనూరుకు చెందిన అడైకలం(65) కుమార్తె మునియమ్మాళ్(42) ముష్టికురిచ్చి గ్రామంలో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె జయలలిత(18) ఉన్నారు. కుమార్తెను ఇంజినీర్‌గా పనిచేస్తున్న తమ సమీప బంధువు ముత్తుకుమార్‌కు ఇచ్చి వివాహం చేసింది. పెళ్లి అయిన నాటి నుంచే ముత్తుకుమార్ భార్య జయలలితను వేధించేవాడు. అలాగే అత్త మునియమ్మాళ్‌పై ఆమె కుమారులకు లేనిపోనివి చెప్పేవాడు. ఈక్రమంలోనే అత్తకు వివాహేతర సంబంధం కూడా అంటగట్టాడు. ఈ ఘటనలతో మనస్థాపం చెందిన మునియమ్మాళ్ కుమార్తె జయలలితతో కలిసి కార్యాపట్టిలోని తన తల్లి అడైకలం ఇంటికి వచ్చేసింది. దీంతో మరింత ఆగ్రహించిన ముత్తుకుమార్ తనకు కొంత సొమ్ము కావాలని ఆదివారం ఫోన్ ద్వారా మునియమ్మాళ్‌ను బెదిరించాడు. మంగళవారం వస్తానని, నగదు సిద్ధం చేయాలని హుకుం జారీ చేశాడు. అల్లుడి ఒత్తిడిని తట్టుకోలేని మునియమ్మాళ్ సోమవారం రాత్రి తల్లి అడైకలం, కుమార్తె జయలలితతో కలిసి విషం తాగేసింది. మంగళవారం ఉదయాన్నే అడైకలం ఇంటికి వచ్చిన ముత్తుకుమార్ తలుపు తట్టినా తెరుచుకోలేదు. ఇరుగుపొరుగు వారు కిటికీలో నుంచి చూడగా ముగ్గురు మహిళల మృతదేహాలు కనిపించాయి. దీనిపై వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను పసిగట్టిన ముత్తుకుమార్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆవియూర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరుప్పు కోట్టై ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ముత్తుకుమార్ కోసం గాలిస్తున్నారు. చదవండి: సోలార్ స్కాం: సరితా నాయర్‌కు 6 ఏళ్ల జైలు -
ప్రేమ విఫలమై యువతుల ఆత్మహత్య
యుక్త వయసులో వచ్చిన ఆకర్షణే ప్రేమని భావించారుగానీ.. 18 ఏళ్లపాటు గుండెలపై పెట్టుకుని పెంచుకున్న తల్లిదండ్రుల ప్రేమను గుర్తించలేకపోయారు.. తాము కోరుకున్న వ్యక్తి లేకుండా బతకలేమని తలచారుగానీ.. బిడ్డలు లేకుండా ఒక్క క్షణమైనా అమ్మానాన్నల గుండె కొట్టుకోదని ఆలోచించలేకపోయారు.. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రులు.. తమ ప్రేమను అర్థం చేసుకోరని అపోహపడ్డారుగానీ.. పిల్లలు లేకపోతే అమ్మానాన్నల జీవితానికి వెలుగు లేదనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు.. క్రోసూరు మండలం గుడిపాడు, సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామాల్లో ఇద్దరు యువతులు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. గుంటూరు జిల్లా/ సత్తెనపల్లి: ప్రేమ విఫలమై ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం క్రోసూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందని నంబూరినాగ తిరుతపతమ్మ (19) అదే గ్రామానికి చెందిన ముక్కాల నాగ సురేష్‌ను ప్రేమించింది. అయితే నాగసురేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో మనస్తాపానికి గురైన నాగ తిరుపతమ్మను సత్తెనపల్లి మండలం వెన్నాదేవిలో నివశిస్తున్న చిన్నమ్మ చింతల వెంకటలక్ష్మి వద్దకు పంపారు. డీఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ నాగతిరుతపమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో సత్తెనపల్లి పట్టణపోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే చింతల వెంకటలక్ష్మి కుమార్తె చింతల రవళి (18) మేనమామ కుమారుడైన కోటేశ్వరరావును ప్రేమించింది. తల్లిదండ్రులు ఆ ప్రేమను అంగీకరించి వివాహం చేయరని రవళి భావించింది. దీంతో నాగ తిరుపతమ్మ, రవళిలు మాట్లాడుకుని ఈనెల 25న రాత్రి సమయంలో శీతల పానియంలో ఎలుకల మందు కలుపుకొని ఆత్మహత్యకు యత్నించారు. నాగతిరుపతమ్మ అదే రోజు మృతిచెందగా రవళి ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండడంతో హుటాహుటిన సత్తెనపల్లిలోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం అంటగట్టారని..
అర్వపల్లి(తుంగతుర్తి) : ఓ వ్యక్తి తమపై వివాహేతర సంబంధం అంటగట్టాడని మనస్తాపానికి గురై ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కుంచమర్తి గ్రామపంచాయతీ ఆవాసం ఉయ్యాలవాడ గ్రామ శివారు బుడగజంగాల కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... బుడగజంగాల కాలనీకి చెందిన తిరుపాటి గట్టమ్మ(26), భూతం సరోజ (25)లు ఇద్దరు వరుసకు వదినా మరదళ్లు. వీరిద్దరి కుటుంబాలు జంగిడిబర్లు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి బహిర్భూమికని వెళ్లి.. పెద్ద మనుషుల సమక్షంలో నిందారోపణలు, భర్తల నిలదీతలతో ఆ ఇద్దరు వివాహితుల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమానభారంతో జీవించే కంటే చావే మేలనుకుని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తెల్లవారు జామున బహిర్భూమికని వెళ్లి కాలనీ సమీపంలో చెట్లకింద క్రిమిసంహారక మందు తాగారు.అనంతరం ఇద్దరూ ఇంటికి వచ్చి పడుకున్నారు. అయితే వారినోట్లో నుంచి నురుగురావడంతో గట్టమ్మ భర్త అయోధ్య వెంటనే విషయాన్ని కాలనీవాసులకు చెప్పి వారిని 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలోనే గట్టమ్మ చనిపోగా సరోజ చికిత్స పొందుతూ మృతి చెందింది. సరోజకు భర్త శ్రీను, కుమారుడు, కుమార్తె ఉండగా, గట్టమ్మకు కూడా భర్త అయోధ్య, కుమారుడు కుమార్తె ఉన్నారు. మృతదేహాలకు సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. ఇద్దరు వివాహితల ఆత్మహత్యకు కడమంచి లింగయ్య కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పాపిరెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని నాగరాం ఎస్సై శ్రీనివాస్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మూడేళ్లుగా మాటలు బంద్ మృతురాలు భూతం సరోజ భర్త శ్రీను కుటుంబానికి నిందితుడు కడమంచి లింగయ్య కుటుంబాలకు మూడేళ్లుగా మాటలు లేవు. రెండు కుటుంబాలకు గొడవలు జరిగి మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలోనే లింగయ్య శ్రీను భార్య సరోజతో వివాహేతర సంబంధం ఉందని అనడం కూడా ఆత్మహత్యకు ఓ కారణం. అయితే కడమంచి లింగయ్య మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని తనకు నచ్చిన మహిళలను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడని కాలనీవాసులు తెలిపారు. పంచాయితీలో నింద కాలనీలో మంగళవారం సాయంత్రం పెద్ద మనుషుల సమక్షంలో ఓ పంచాయితీ జరిగింది. ఆ పంచాయితీకి హాజరైన అదే కాలనీకి చెందిన లింగయ్య తాను ఇదే కాలనీకి చెందిన తిరుపాటి గట్టమ్మ, భూతం సరోజలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన వార్తి భర్తలు అవాక్కై భార్యలను నిలదీశారు. కొంతకాలంగా వేధింపులు గట్టమ్మ, సరోజలను కడమంచి లింగయ్య తరుచూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని తెలిసింది. వారితో ఫోన్లో మాట్లాడే విషయాలు సెల్లో రికార్డు చేసి బెదిరించేవాడని సమాచారం.అయితే నిందితుడు లింగయ్య పరారీలో ఉన్నాడు. అయన్ను విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని బుడిగజంగాల కుటుంబాల వారు చెబుతున్నారు. -
‘వైవాహిక’ కష్టాల వల్లే మహిళల ఆత్మహత్యలు
న్యూఢిల్లీ: వైవాహిక జీవితంలో బయటకు చెప్పలేని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నందునే ఎంతోమంది అభాగినులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. గర్భవతి అయిన భార్య ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పిన కర్ణాటక వాసికి ఆ రాష్ట్ర హైకోర్టు విధించిన ఐదేళ్ల జైలుశిక్షను తగ్గించేందకు మంగళవారం తిరస్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. దురదృష్టకర పరిస్థితుల్లో 25 ఏళ్ల వయస్సుకే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన బాధితురాలి కథ.. వైవాహిక జీవితంలో నాలుగ్గోడల మధ్య అనుభవించిన కష్టాలు, బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఎందరో అభాగినుల ఉదంతాలను గుర్తుకుతెస్తోందని పేర్కొంది. బాధిత యువతికి 1991లో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే 1993, నవంబర్‌లో తన భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు అతడు ఫిర్యాదు చేశాడు.