1000 స్వర్ణాలు కొల్లగొట్టిన అమెరికా
రియో ఒలింపిక్స్ సందర్భంగా అమెరికా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న రియో ఒలింపిక్స్ తో సహా అన్ని ఒలింపిక్స్ లలో కలిపి 1000కి పైగా స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక జట్టుగా అమెరికా నిలిచింది. రియోలో భాగంగా అమెరికా మహిళా స్విమ్మర్లు కాథలీన్ బేకర్, లిల్లీ కింగ్ ,డాన్ వాల్మీర్, సిమోల్ మాన్యుల్ శనివారం జరిగిన 4x100 మీటర్ల మెడ్లే రిలేలో స్వర్ణం సాధించడంతో అగ్రదేశం ఈ అరుదైన ఫీట్ నమోదు చేసింది.
1000 స్వర్ణాలు సాధించడమనేది చాలా గొప్ప విజయమని, ఆటలకు అమెరికా ఇచ్చే ప్రాధాన్యత ఇట్టే తెలుసిపోతుందని అమెరికా ఒలింపిక్ కమిటీ చీఫ్ స్కాట్ బ్లాక్‌మన్ అన్నారు. ఈ పతకాలలో సగానికంటే ఎక్కువగా ట్రాక్ అండ్ ఫీల్డ్(323), స్విమ్మింగ్(246) విభాగాల నుంచి వచ్చాయని వారి కృషి ఫలితంగానే ఈ ఫీట్ సాధ్యమైందన్నాడు. రియోలో అడుగుపెట్టేసరికి అమెరికా ఖాతాలో 977 స్వర్ణాలున్నాయి.
ఓ వైపు ఫెల్ప్స్ తో పాటు స్విమ్మర్లు స్వర్ణాలు కొల్లగొడుతుండగా, అమెరికా మహిళా స్విమ్మర్లు కాథలీన్ బేకర్, లిల్లీ కింగ్ ,డాన్ వాల్మీర్, సిమోల్ మాన్యుల్ శనివారం జరిగిన 4x100 మీటర్ల మెడ్లే రిలేలో స్వర్ణం సాధించడంతో అమెరికా వెయ్యి స్వర్ణాల మైలురాయిని దాటింది. వెయ్యి స్వర్ణాలు నెగ్గిన తర్వాత జరిగిన పరుషుల 4x100మీ. మెడ్లే రిలే స్విమ్మింగ్ ఈవెంట్లో మరో నాలుగు స్వర్ణాలు అమెరికా ఖాతాలో చేరిన విషయం తెలిసిందే.