won in kabaddi
-
కబడ్డీ విజేతగా ఎస్ఎస్బీఎన్
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎస్కేయూ అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీల్లో ఎస్ఎస్బీఎన్ జట్టు తన హవాను కొనసాగించింది. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన పోటీల్లో కబడ్డీ, బాస్కెట్‌బాల్ క్రీడా పోటీల్లో ఎస్ఎస్బీఎన్ జట్టు విజేతగా నిలిచి సత్తాను చాటింది. కబడ్డీలో విజయం సాధించడంతో పదోసారి విజేతగాను, బాస్కెట్‌బాల్‌లో తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. దీంతో ఎస్ఎస్బీఎన్ జట్టు ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ విజేతగా నిలిచే అవకాశం ఉంది. కబడ్డీ పోటీల్లో ఎస్ఎస్బీఎన్ జట్టు ఆర్ట్స్ కళాశాల జట్టు పై 44–18 స్కోరుతో విజయం సాధించింది. బాస్కెట్‌బాల్ పోటీల్లో ఎస్ఎస్బీఎన్ జట్టు ఆతిథ్య ఆర్ట్స్ కళాశాల జట్టుపై 39–0తో విజయం సాధించి సత్తా చాటింది. వీటితో పాటు వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరింది. త్రోబాల్ పోటీల్లోనూ సెమీస్‌కు చేరుకుంది. ఖోఖో పోటీల్లో ఎస్కేపీ గుంతకల్లు జట్టు ఆర్ట్స్ కళాశాల జట్టుపై గెలిచి విజేతగా నిలిచింది. ఈ క్రీడా పోటీలు శనివారం ముగియనున్నాయని ఆర్ట్స్ కళాశాల పీడీలు శ్రీనివాసులు, జబీవుల్లాలు తెలిపారు. ఈ క్రీడా పోటీలను ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరి జెస్సీ, పీడీలు వెంకటేష్‌నాయక్, చంద్రమోహన్, ప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. -
కబడ్డీ విజేత గుంతకల్లు జట్టు
యాడికి : పట్టణంలో నిర్వహించిన రంగనాథ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది. రెండు రోజులుగా యాడికిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. గుంతకల్లు, యాడికి జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ, తతీయ స్థానంలో యాడికి జట్లు నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులతో పాటు మెమొంటోలు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో సౌత్ ఇండియన్ కేవీఐసీ చైర్మన్ చంద్రమౌళి, యాడికి ఎంపీపీ వేలూరు రంగయ్య, మాజీ ఉప సర్పంచ్ బాలా రమేశ్‌బాబు, జేవీవీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్, పీడీ మురళి, పీఈటీ సాల్మన్ సుప్రీం, నిర్వాహకులు బాబు, విశ్వనాథ్, కుమార్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.