కబడ్డీ విజేత గుంతకల్లు జట్టు
యాడికి : పట్టణంలో నిర్వహించిన రంగనాథ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది. రెండు రోజులుగా యాడికిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. గుంతకల్లు, యాడికి జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ, తతీయ స్థానంలో యాడికి జట్లు నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులతో పాటు మెమొంటోలు అందజేశారు.
బహుమతుల ప్రదానోత్సవంలో సౌత్ ఇండియన్ కేవీఐసీ చైర్మన్ చంద్రమౌళి, యాడికి ఎంపీపీ వేలూరు రంగయ్య, మాజీ ఉప సర్పంచ్ బాలా రమేశ్‌బాబు, జేవీవీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్, పీడీ మురళి, పీఈటీ సాల్మన్ సుప్రీం, నిర్వాహకులు బాబు, విశ్వనాథ్, కుమార్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.