ఝాన్సీకి నాసా అంతర్జాతీయ అవార్డు
పెనుమాక(తాడేపల్లిరూరల్), న్యూస్‌లైన్: గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని కొక్కిలగడ్డ ఝాన్సీకి అంతర్జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ నిర్వహించిన పోటీల్లో వ్యక్తిగత స్థాయి ప్రథమ స్థానం లభించింది. విద్యార్థులకు ఏటా నాసా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తుంది.
నూజివీడు ఐఐఐటీలో ఝాన్సీ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. 2013-14 పోటీల్లో ‘ది వండర్ ఓయాసిస్’ పేరుతో ఓ పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించింది. ప్రపంచ వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరిశోధన పత్రాలు పంపారు. ఝాన్సీకి గ్రేడ్ 12 కేటగిరీలో మొదటి బహుమతి వచ్చింది.
ఝాన్సీ తండ్రి వెంకటేశ్వరరావు పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి ఆంధ్ర లక్ష్మి గృహిణి. సోదరి రాధ నూజివీడు ఐఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతుంది. తనకు సైన్స్ ఇష్టమని, పెద్దయ్యాక సైంటిస్ట్ కావాలనుకుంటున్నానని ఝాన్సీ న్యూస్‌లైన్‌కు తెలిపింది.