దర్శనంతో ఎంతో ప్రశాంతత
ఇప్పటి వరకూ 14 సార్లు తిరుమల బాలాజీని దర్శనం చేసుకున్నా. ఆనంద నిలయంలో స్వామివారిని కళ్లారా చూడగానే...చెప్పాలనుకున్నవన్నీ మర్చిపోతాం. మనస్సు అద్భుత భావంతో పులకించి పోతుంది. తిరుమల గాలిలోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు....అడిగినవన్నీ బాలాజీ ఇచ్చేస్తాడు.