work areas
-
అంత ‘స్పేస్’ వద్దు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును డిసెంబర్ వరకు పొడిగించాయి. ఇన్ఫోసిస్, గూగుల్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది మార్చి వరకు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించాయి. దీంతో మిగతా కంపెనీలు కూడా అదే యోచనలో ఉన్నాయి. మరోవైపు ఐటీ కంపెనీలు.. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరును రెగ్యులర్, స్టాండప్, స్టార్టప్ కాల్స్‌తో పాటు స్క్రీన్ మానిటరింగ్ విధానంలో పర్యవేక్షిస్తూ గతంలో 9 గంటలున్న పనివేళలను ప్రస్తుతం 12 గంటలకు పెంచినట్లు తెలుస్తోంది. వర్క్ ఫ్రమ్ హోం విధానం పొడిగింపుతో ఐటీ కంపెనీ కార్యాలయాలు, ఐటీ కారిడార్లు మరికొంత కాలం బోసిపోనున్నాయి. ఆఫీస్ స్పేస్ తగ్గింపుపై కసరత్తు గతేడాది ఆఫీస్ స్పేస్ విషయంలో బెంగళూరును అ«ధిగమించిన హైదరా బాద్.. వచ్చే మూడేళ్లలో అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేశారు. నగరం లోని ఆఫీస్స్పేస్లో 50% ఐటీ కంపె నీలే ఉపయోగిస్తున్నాయి. లుక్ ఈస్ట్ పాలసీ, గ్రోత్ డిస్పెన్షన్ పాలసీల్లో భాగంగా భవిష్యత్తులో ఐటీ ఆఫీస్ స్పేస్ మరింత పెరుగుతుందని రియల్ ఎస్టేట్ సంస్థలు అంచనా వేశాయి. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో పెద్దసంఖ్యలో ఉన్న ఎంఎస్ఎంఈ కంపె నీలు ఆఫీస్‌స్పేస్‌ను తగ్గించుకోవ డంపై దృష్టిపెట్టాయి. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ఆఫీస్‌స్పేస్‌ను అద్దెకిస్తున్న సంస్థలు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా దెబ్బ తిన్నాయి. సీట్ల సంఖ్య ఆధారంగా వసతులను బట్టి గతంలో ఒక్కో సీటుకు రూ.5 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేసిన సంస్థలు ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయాయి. లీజు ఒప్పందాలపైనా పునః సమీక్ష కార్యాలయాలను అద్దెకు తీసుకున్న పలు చిన్నా చితకా ఐటీ కంపెనీలు అద్దె భారం, నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాయి. ప్రధానంగా భవన యజమానులతో కుదుర్చుకున్న అద్దె ఒప్పందాలను పునఃసమీక్షించుకుంటూ ఆఫీస్ స్పేస్‌ను తగ్గించుకోవడమో లేదా కార్యాలయాలను ఖాళీ చేయడమో చేస్తున్నాయి. అద్దె భారాన్ని మోయలేని కొన్ని సంస్థలు లీజు పీరియడ్‌ను తగ్గించు కోవడం లేదా అద్దె మొత్తాన్ని తగ్గించుకునేందుకు యాజమాన్యాలతో బేరసారాలు సాగిస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్, టీసీఎస్ వంటి సొంత ప్రాంగణాలను కలిగి ఉన్న సంస్థలు మాత్రం ఆఫీస్ స్పేస్ తగ్గింపు దిశగా యోచించట్లేదు. విడ్ పరిస్థితుల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలపై హైదరా బాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసి యేషన్ గత నెలలో సర్వే నిర్వహించింది. కోవిడ్‌కు ముందు పదివేలలోపు చదరపు అడుగుల విస్తీర్ణంలో 32.6%, 50వేల లోపు 37.2%, లక్షలోపు 6%, లక్ష నుంచి ఐదు లక్షలలోపు 11.6%, 5 లక్షల చద రపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 14% కంపెనీలు కార్యకలాపాలు నిర్వ హిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో 12.8% కంపెనీలు ప్రస్తుతమున్న చోటే యథా విధిగా అద్దె చెల్లిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 33% కంపెనీలు మాత్రం అద్దె తగ్గింపునకు సంబంధించి భవన యాజమానులతో బేరసారాలు కుదుర్చు కున్నాయి. 24.1% కంపెనీలు ఆఫీస్ స్పేస్‌ను 25% నుంచి వంద శాతానికి తగ్గించుకున్నట్లు హైసియా సర్వే వెల్ల డించింది. మరో 43.6% కంపెనీలు ఆఫీస్ స్పేస్ వివరాలు వెల్లడించలేదు. కోవిడ్ మూలంగా ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకునేందుకు గత నెలలో సర్వే నిర్వహించాం. వర్క్ ఫ్రమ్ హోం, ఆఫీస్ స్పేస్ మొదలు అనేక అంశాలపై వివ రాలు సేకరించి విశ్లేషించాం. ఐటీ కంపె నీల ఆర్థిక కార్యకలాపాలపై ఈ ఏడాది చివరిలోగా స్పష్టత రావచ్చు. హైదరా బాద్ ఐటీ వాణిజ్యం ఎక్కువగా యూఎస్‌తో పాటు యూరోప్ దేశాలపై ఆధారపడి ఉంది. అక్కడి పరిణామాల పైనే స్థానిక ఐటీ రంగం చాలావరకు ఆధారపడి ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాలను చిన్న ఐటీ కంపెనీలు పునః సమీక్షించుకుంటున్నాయి. – భరణికుమార్ ఆరోల్, అధ్యక్షుడు, హైసియా సీటింగ్ వ్యయాన్ని తగ్గించుకుంటున్నాం గతంలో ప్లగ్ అండ్ ప్లే కార్యాలయంలో మా సిబ్బంది కోసం ప్రతీ నెలా రూ.60వేలు అద్దె చెల్లించే వాళ్లం. కోవిడ్ నేపథ్యంలో ఆరు నెలలుగా ఖర్చును తగ్గించు కునేందుకు ఆఫీస్‌స్పేస్ తగ్గించుకున్నాం. పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాం. వచ్చే ఏడాది బిజినెస్ ఎలా ఉంటుందో ఫిబ్రవరి తర్వాతే స్పష్టత రావచ్చు. – ఆనంద్ వర్ధన్, ఐటీ హెచ్ఆర్ సర్వీసెస్ ఏజెన్సీ -
ఏఐసీసీ కార్యదర్శులకు పని విభజన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 2019 ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి కార్యదర్శులుగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు శనివారం ఢిల్లీలోని పార్టీ వార్‌రూమ్‌లో జరిగిన సమావేశంలో పని విభజన చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి అశోక్ గెహ్లాట్, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుం తియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నాలుగున్నర గంటలపాటు చర్చించారు. కొత్తగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు 40 నియోజకవర్గాల చొప్పున పని విభజన చేశారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి 90 రోజులపాటు కార్యదర్శులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. జిల్లా, బ్లాక్, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికలు డిసెంబర్లో వచ్చినా ఓకే... పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు డిసెంబర్లో వచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, పార్టీని బలోపేతం చేయడమే తమ కర్తవ్యమని ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. వార్‌రూమ్ సమావేశం అనంతరం ఉత్తమ్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పులు ఉంటాయన్న వార్తలు అవాస్తవం. ఉత్తమ్ నేతృత్వంలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాం. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చు. నేరుగా రాహుల్‌గాంధీకి చెప్పినా అభ్యంతరం లేదు. కానీ మీడియాలో ప్రకటనలు చేస్తే కఠిన చర్యలుంటాయి’’అని హెచ్చరించారు. ‘‘పార్టీని వీడేవారు వీడుతుంటారు. ఆ ఆలోచన ఉన్నవారిని ఎలా ఆపగలం? 2014తో పోలిస్తే మా ఓటు బ్యాంకు 10 శాతం పెరిగింది. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారినా మా ఓటు బ్యాంకు పెరిగింది’’ అని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇన్చార్జులకు విస్తృత అధికారాలు... ‘‘నూతన ఏఐసీసీ కార్యదర్శులకు విస్తృత అధికారా లుంటాయి. అభ్యర్థుల ఎంపిక సహా పలు అధికారాలు వారికి అప్పగించారు. డిసెంబర్లో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేలా పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఈ ఏడాది ఎన్నికలున్న రాష్ట్రాలకే ఎన్నికల కమిటీలను నియమించారు. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలకు నియమించలేదు’’అని ఉత్తమ్ అన్నారు. -
లుంగీ డాన్స్...తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీశారు
*యూనిఫాంలోనే ఉంటారు .. కానీ డ్యూటీ చేయరు ... *ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంగితం కూడా ఉండదు ... *మ్యూజిక్ ఆన్ అయితే చాలు ... అటోమెటిక్‌గా స్టెప్పులేసేస్తారు ... *ఇక అమ్మాయి తోడైతే ... ఒళ్లు మరచిపోతారు ... *ఆ నిషాలో ... ఒక్కోసారి ఎక్స్‌ట్రాలు చేస్తుంటారు, ఆనక ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. * అలాంటి స్పెషల్ డాన్స్ ఛమ్మక్కులే .... ఈ 'ఏసేయ్ రా జజ్జనక జజ్జనక'. యూనిఫాంలో ఉన్న ఓ ఎస్ఐ ... ఆ విషయమే మర్చిపోయాడు. ఎదురుగా ఓ ఛమక్ ఛల్లో కనిపించగానే అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయ్. అంతే ... అక్కడే సెటిలైపోయాడు. లంచాలు వసూలు చేస్తే వచ్చిన డబ్బులో ఏమో .. ఇష్టానుసారంగా డాన్సర్‌పై కరెన్సీ వెదజల్లాడు. ఇక ఆగలేక ఏకంగా అతడు కూడా స్టెప్పులేయడం మొదలెట్టాడు. ఈ సూపర్బ్ సీన్ గుజరాత్లో జరగ్గా ... ఓ పోలీస్ వీరాభిమాని మొబైల్లో రికార్డ్ చేశాడు. *ఈయనే కాదు ఈమధ్య ఇలాంటి పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉత్తర్ ప్రదేశ్ సుజ్జహాన్ పూర్లో ఓ పోలీస్ ఆఫీసర్ .. రికార్డింగ్ డాన్సర్ డాన్స్ చేస్తుంటే .. ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు. యూనిఫాంలో ఉండి ఇలాంటి సిగ్గుమాలిన పనికి పాల్పడినందుకు ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. *ట్రైనింగ్ కోసం వచ్చిన లేడీ కానిస్టేబుల్‌కు రాజస్థాన్ అజ్మీర్‌లోని బేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఎలాంటి శిక్షణ ఇచ్చారో తెల్సుకుంటే ... దిమ్మ తిరగడం ఖాయం. పోలీసింగ్‌పై పాఠాలు నేర్పాల్సిందిపోయి ఏకంగా ఐటమ్ సాంగ్స్‌పై డాన్స్ చేయించారు. సబ్-ఇన్స్పెక్టర్ ఉదయ్ సింగ్ ఈ నిర్వాకాన్ని వెలగబెట్టగా .. మిగిలిన వారు అలా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. *హర్యానాలోనూ సేమ్ సీన్. ఓ పోలీస్ అధికారికి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యినందుకుగానూ ఓ ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు. అక్కడి వరకూ ఓకేగానీ .. ఆ పార్టీలో రికార్డింగ్ డాన్సర్లతో డాన్స్ చేయించడమే అందరికీ పెద్ద ఝలఖ్ ఇచ్చింది. *ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అందరి సంగతేమోగానీ .. పోలీస్ స్టేషన్‌ను స్టేజ్ చేసుకుని, హుషారుగా డాన్స్ చేయడంలో ఢిల్లీ పోలీస్ తర్వాతే ఎవ్వరైనా. షారూక్‌ఖాన్‌కు పోటీనిచ్చారు ...లుంగీలు కట్టకపోయినా ఆ రేంజ్లో అదరగొట్టారు ...అవును, పోలీసులు కింగ్ ఖాన్ డాన్స్‌ను కాపీ కొట్టారు. *మహిళల దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పోలీస్ బాసులు, లేడీ కొలీగ్స్‌తో ఇదిగో ఇలా చెలరేగిపోయారు. ఈ డాన్స్ హంగామాలో ... ముంబై రైల్వే పోలీస్, బాంద్రా జోన్ ఏసిపి ఎస్ ఎస్.బిజ్వే స్పెషల్ ఎట్రాక్షన్ కాగా .. ఆయనతో పాటు మరికొందరు లుంగీ డాన్స్ చేశారు. *అసలే హోలీ ... ఆపై తాగిన పోలీస్ బాబాయిలు, ఇంకేముంది పోలీస్ స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. ఖాకీలు, ఖైదీలు అన్న తేడా లేకుండా అందరూ తీన్ మార్ స్టెప్పులేసేశారు. ఇక మీరట్ పోలీసులు ఏమైనా తక్కువ తిన్నారా? బంగ్ తాగి .. బంగీ జంప్స్ చేశారు. నేరస్థులతో కలిసి నాచ్గానాలో పాల్గొన్నారు. మీడియా ఎంట్రీ ఇవ్వడంతో ... సీన్ లోంచి మెల్లిగా జారుకున్నారు. *అలాని కేవలం మగమహారాజులే ఇలా ఆన్ డ్యూటీలో చిందులేస్తారనుకుంటే పొరపాటే. గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో లేడీ పోలీస్‌లు కాసేపు ఆటపాటలతో రీఛార్జ్ అయ్యారు. అది స్టేషన్ అని, తాము యూనిఫాంలో ఉన్నామని .. అస్సలంటే అస్సలూ పట్టించుకోకుండా ... పండగ చేసుకున్నారు. *డాన్స్ అంటే పంజాబీలు ప్రాణమిస్తారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కానీ ఆఫీసు వేళల్లో డాన్స్ అంటేనే రియాక్షన్ వేరుగా ఉంటుంది. కానీ ఆ పంజాబీ ఖాకీలు రూల్స్‌ని లైట్ తీసుకున్నారు. స్టేషన్లోనే డాన్స్ సెటప్ పెట్టేశారు. అలాని అందరు పోలీసులు ఇలానే ఉంటారని కాదుగానీ .. ఇలాంటి గంజాయి మొక్కలు, తులసి వనంలో ఉంటే మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు రావడం ఖాయం.