work inspector
-
వర్క్ ఇన్స్పెక్టర్పై దాడి
అదొక ప్రభుత్వ కార్యాలయం. అప్పుడప్పుడే అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో అధికార పార్టీ నేత వచ్చారు. నేరుగా వర్క్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి తాను చెప్పిన వ్యక్తి పేరిట ఆన్లైన్లో పేరు నమోదు చేసి ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయాలని హుకుం జారీ చేశాడు. తన పరిధి మేరకే నడుచోగలనని చెప్పిన వర్క్ ఇన్స్పెక్టర్పై ఆగ్రహంతో ఊగిపోయాడు. అందరూ చూస్తుండగానే వర్క్ ఇన్స్పెక్టర్ చెంపను చెల్లుమనిపించాడు. బలంగా గుద్దడంతో గాయపడ్డాడు. అనంతపురం, కొత్తచెరువు: కొత్తచెరువు హౌసింగ్ కార్యాలయంలో అధికారుల సాక్షిగా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ రవినాయక్‌పై టీడీపీ మండల కన్వీనర్ దామెదర్నాయుడు దాడి చేశాడు. సోమవారం ఉదయం రవినాయక్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా దామెదర్ నాయుడు అక్కడకు వచ్చాడు. తన బంధువు ఎం.హరిప్రసాద్ ఇంటి నిర్మాణం పూర్తి అయిందని, ఫొటో తీసుకుని వెంటనే బిల్లులు మంజూరు చేయాలని చెప్పాడు. ఇంటి నిర్మాణంలో పునాది వరకు తన బాధ్యతని, తర్వాత ఏఓతో మాట్లాడండి అని వర్క్ఇన్స్పెక్టర్ సమాధానం చెప్పాడు. ‘నేను చెప్పినా వినవా’ అంటూ రవినాయక్ చెంపపై దామోదర్‌నాయుడు బలంగా గుద్దాడు. తోటి ఉద్యోగులు జోక్యం చేసుకుని విడిపించారు. అయినా దామోదర్‌నాయుడు ఆగ్రహం చల్లారలేదు. వర్క్ ఇన్స్పెక్టర్ బ్యాగును ఆఫీసు నుంచి బయటకు విసిరేశాడు. కులం పేరును ప్రస్తావిస్తూ పత్రికలో రాయలేని పదజాలంతో దూషించాడు. దాడిలో గాయపడిన రవినాయక్‌ను తోటి ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెనుకొండకు పంపించారు. టీడీపీ నాయకుల ఒత్తిడి కారణంగా తమ సార్ మల్లికార్జున ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని బాధితుడు రవినాయక్ ఆరోపించాడు. అనంతరం హౌసింగ్ అధికారి భాస్కర్‌రావు, లంబాడీ హక్కుల సంఘం నాయకులతో కలిసి బాధితుడు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. కులం పేరుతో దూషించి, దాడి చేసిన దామోదర్నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
బూత్ బంగ్లాలా ఆర్ అండ్ బీ కార్యాలయం
పటాన్చెరు : పట్టణంలోని ఆర్అండ్బీ ఇంజనీరింగ్ కార్యాలయం బూత్ బంగళాలాను తలపిస్తోంది. దయ్యాల సినిమాల్లో కనిపించే విధంగా ఆ బంగళా చూసి స్థానికులు భయం తో వణికి పోతున్నారు. స్థానికుల సంగతి పక్క న పెడితే జేఈ రాజశేఖర్ కూడా అందులో కూర్చునేందుకు జంకుతున్నారు. ఇదే విషయమై ఆయన వివరణ కోరగా తన కార్యాలయంలో తనతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ మా త్రమే ఉంటారని తామిద్దరం నేరుగా సైట్ల వద్దకు వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఈ కారణంగా తాము కార్యాలయానికి రాలేక పో తున్నామన్నారు. నిజాం కాలం నాటి బంగళాలో పాము లు, ఇతర కీట కాలు ఉన్నాయని, విద్యుత్ సరఫరా కూడా లేదని వివరించా రు. దీంతో చేసేది లేక కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులు ఎప్పుడు తన వద్దే ఉంచుకుంటున్నట్లు ఏఈ తెలిపారు. సంగారెడ్డిలోని ఆర్అండ్బీ సబ్‌డివిజన్ కార్యాలయంలో పాత రికార్డులను భద్రం చేస్తున్నామన్నారు. ఇతర కార్యకలాపాలు కూడా అక్కడి నుంచి కొనసాగిస్తున్నామన్నారు. -
ఏసీబీ వలలో హౌసింగ్ చేప
వర్గల్, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారులు మారో లంచావతారాన్ని పట్టేశారు. ఓ లబ్ధిదారున్నుంచి రూ,10 వేలు తీసుకున్న హౌసింగ్ ఇన్స్పెక్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతికి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం...వర్గల్ మండలం మాదారం గ్రామానికి చెందిన ఎర్ర సత్తమ్మకు రచ్చబండ ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ మేరకు ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారు సత్తమ్మ కుమారుడు మల్లేశం ఇంటి బిల్లు కోసం వర్గల్ మండల హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ వి.కొండల్‌రెడ్డిని సంప్రదించాడు. మొత్తం నాలుగు దఫాలుగా ఇచ్చే ఇంటి బిల్లు రూ.90 వేలుఒకేసారి ఇచ్చేందుకు వర్క్ ఇన్స్పెక్టర్ కొండల్‌రెడ్డి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సత్తమ్మ కొడుకు మల్లేశం ఆయన్ను బతిమిలాడి చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొండల్‌రెడ్డి సూచన మేరకు ఆ మొత్తాన్ని బుధవారం నాచారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) వద్ద ఇస్తానని తెలిపాడు. అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చేరవేసిన మల్లేశం, వారి సూచనలకు అనుగుణంగా బుధవారం తల్లి సత్తమ్మతో కలిసి ఉదయం 9 గంటలకు బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.10 వేలను హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్కు లంచంగా ఇచ్చేందుకు జేబులో భద్రపరచుకున్నాడు. ఒంటి గంట ప్రాంతంలో బ్యాంకుకు చేరుకున్న కొండల్‌రెడ్డి లబ్ధిదారు సత్తమ్మ, ఆమె కొడుకు మల్లేశంను బ్యాంకులోకి తీసుకెళ్లాడు. తన వద్ద ఉన్న సత్తమ్మ పాసు బుక్కును అక్కడి బ్యాంకు అధికారులకు చూపించి అందులోనుంచి బిల్లు మొత్తాన్ని దాదాపు రూ.90 వేలు లబ్ధిదారు సత్తమ్మకు ఇప్పించాడు. బ్యాంకు వెలుపలికి రాగానే మల్లేశం ఇచ్చిన రూ.10 వేలను తీసుకున్న వర్క్ ఇన్స్పెక్టర్ కొండల్‌రెడ్డి తన జేబులో పెట్టుకున్నాడు. ఈ సమయంలో అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడిచేసి నిందితున్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇతర గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెందిన బ్యాంకు పుస్తకాలు స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేశారు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసే సమయంలో ఏసీబీకి చిక్కకుండా లబ్ధిదారుల నుంచి లంచం సొమ్ము స్వీకరించేందుకు వర్క్ ఇన్స్పెక్టర్ పాస్‌పుస్తకాలు తన వద్దనే ఉంచుకోవడం ఆశ్చర్యపరుస్తోందని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన కొండల్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. అవినీతి అడ్డుకునేందుకు ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 9440446155 నంబర్‌కు సమాచారమివ్వాలని ఆయన సూచించారు. -
ఒక ఉద్యోగం, రెండు వేతనాలు
హుజూర్నగర్, న్యూస్‌లైన్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ)శాఖ హుజూర్నగర్ సబ్‌డివిజన్ పరిధిలోని మానిటరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న లక్కాకుల వెంకటకృష్ణ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఖమ్మం ఎన్ఎస్పీ లో ఇటీవల జరిగిన ఆడిటింగ్‌లో అతని అవి నీతి వెలుగులోకి వచ్చింది. చేసేది ఒక ఉద్యోగమే అయినా రెండు వేతనాలు పొందుతూ దర్జాగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నాడు. ఒక వేతనాన్ని బ్యాంక్ అకౌంట్ ద్వారా, మరో వేతనాన్ని నేరుగా తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశాడు. 2009 నుంచి 2013 మార్చి వరకు ఖమ్మం ఎన్ఎస్పీలో ప్రతినెల *25 వేల నుంచి *30వేల వరకు వేతనం పొందుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అతనికి ఇష్టారాజ్యంగా మారింది. ఐదేళ్లనుంచి సుమారు *16లక్షల వరకు ఆ ఉద్యోగి వేతనం రూపేణా స్వాహా చేశాడు. పూర్తిస్థాయి వివరాల్లోకి వెళితే.. హుజూర్నగర్ ఎన్ఎస్పీ సబ్ డివి జన్‌లో ఎన్‌ఎంఆర్‌గా ఉద్యోగం చేసిన వెంకటకృష్ణ కొద్దికాలానికి వర్క్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందాడు. అంతేగాక అతను ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ఎన్ఎస్పీ ఉన్నతాధికారుల అండతోనే ఈ తతం గం జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఎన్ఎస్పీ శాఖలో అధికార పార్టీకి చెందిన ట్రేడ్‌యూనియన్ నాయకునిగా అధికారులను చేతిలో పెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఇప్పటికే పట్టణంలోని ఎన్ఎస్పీలో ఎన్ఎంఆర్ల నియామకంలో అనేక అక్రమాలు జరిగాయని, నియామకాలు సక్రమంగా లేవని ఇతర ప్రాం తాలకు చెందిన వారు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలుచేస్తున్నట్లు పట్టణానికి చెందిన పలు పార్టీల నాయకులు జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. చివరకు ఈ వివాదం సద్దుమణిగిన కొద్దిరోజుల్లోనే ఈ విషయం వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అంతేగాక సదరు ఉద్యోగి ఎన్ఎస్పీలో పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు తదితర బెనిఫిట్స్ ఫండ్‌ను సకాలంలో ఇప్పించడంలో మంచి పైరవీకారుడిగా కూడా ఖమ్మం ఎన్ఎస్పీ డివిజన్లో పేరు సంపాదించాడు. వెలుగు చూసిందిలా.. ఖమ్మం ఎన్ఎస్పీ డివిజన్లో ఎన్‌ఎంఆర్‌లకు జీతాల చెల్లింపులో పలు అవతవకలు జరిగాయి. గతంలో కొందరు చనిపోయిన వారి పేరు మీద కూడా వేతనాలు డ్రా చేసి సుమారు *65లక్షల వరకు స్వాహా చేశారు. ఈ విషయానికి సంబంధించి ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఫైల్టు ఫైల్ ఆడిట్ నిర్వహించగా ఎన్ఎస్పీ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ *16లక్షలు స్వాహా చేసిన బాగోతం వెలుగు చూసింది. అయితే ఖమ్మం ఎన్ఎస్పీ డివిజన్ కార్యాలయంలో అవినీతికి సూత్రధారులుగా మానిటరింగ్ కార్యాలయంలోని సీని యర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ల పేర్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో సూపరింటెండెంట్ రాజారావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులతో వెంకటకృష్ణకు గల సాన్నిహిత్యంతోనే అవినీతికి పాల్పడేందుకు అవకాశం లభించినట్లు సదరు శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.