అమరావతికి ప్రపంచ బ్యాంక్ బృందం
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం సందర్శించింది. కొండవీటి వాగును పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం. ఈ వాగు వల్ల దాదాపు 13 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు రాజధాని గ్రామాల్లో ఈ బృందం పర్యటిస్తున్నది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో కొంత సమయం గడిపారు. అనంతరం ఉద్రండాయినిపాలెం, కృష్టాయపాలెం, మందడంలలో పర్యటించారు.