World Cup Wrestling Tournament
-
రెజ్లర్ అన్షుకు రజతం
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్లో మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ రజత పతకం సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో అన్షు 1–5 పాయింట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ అనస్తాసియా నిచితా (మాల్డోవా) చేతిలో ఓడిపోయింది. 55 కేజీల కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ పింకీ 0–10తో ఓల్గా ఖొరోషత్సోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత రెజ్లర్లు రవి దహియా (57 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), సుమీత్ (125 కేజీలు), నవీన్ (70 కేజీలు) నిరాశపరిచారు. -
భారత జట్లకు నిరాశ
న్యూఢిల్లీ: ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు నిరాశపర్చారు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ ఫ్రీస్టయిల్ గ్రూప్ ‘బి’ విభాగంలో భారత జట్టు 1-7తో అమెరికా చేతిలో; 0-8తో ఇరాన్ చేతిలో ఓడింది. అమెరికాతో జరిగిన ఎని మిది బౌట్లలో కేవలం 74 కేజీ విభాగంలో మాత్రమే టీమిండియా రెజ్లర్ ప్రవీణ్ రాణా 5-4తో అలెగ్జాండర్ డేవిడ్ డైరింగర్పై నెగ్గాడు.