
బెల్‌గ్రేడ్ (సెర్బియా): ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ రజత పతకం సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో అన్షు 1–5 పాయింట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ అనస్తాసియా నిచితా (మాల్డోవా) చేతిలో ఓడిపోయింది. 55 కేజీల కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ పింకీ 0–10తో ఓల్గా ఖొరోషత్సోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత రెజ్లర్లు రవి దహియా (57 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), సుమీత్ (125 కేజీలు), నవీన్ (70 కేజీలు) నిరాశపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment