ఆన్లైన్ షాపింగ్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ కామర్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆన్లైన్ షాపింగ్ 88 శాతం వృద్ధితో 1,600 కోట్ల డాలర్లకు చేరిందని అసోచామ్ తాజా సర్వే వెల్లడించింది. ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం, డబ్బులు చెల్లించే మార్గాలు విరివిగా ఉండడం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు వంటి కారణాల వల్ల ఆన్లైన్ షాపింగ్ జోరుగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్, రావత్ తెలిపారు. సర్వే ముఖ్యాంశాలు...,
మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, యాక్సెసరీలు, ఎంపీ3 ప్లేయర్లు, డిజిటల్ కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలే కాక దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాలు, వాచీలు వంటి లైఫ్‌స్టైల్ యాక్సెసరీలు, పుస్తకాలు, సౌందర్యోత్పత్తులు, అత్తర్లు, చిన్న పిల్లల ఉత్పత్తులు గత ఏడాది కాలంలో బాగా అమ్ముడయ్యాయి.
2009లొ 250 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఈ కామర్స్ మార్కెట్ 2012లో 850 కోట్ల డాలర్లకు చేరింది,
ఆన్లైన్ డిస్కౌంట్లు ఆకర్షణీయంగా ఉండడం, సమయం ఆదా కావడం వంటి కారణాల వల్ల ఆన్లైన్ షాపింగ్ జోరు పెరుగుతోంది.
ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల విషయంలో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, కోల్‌కతాలు నిలిచాయి.
ఆన్లైన్ వినియోగదారుల్లో 65% మంది పురుషులుండగా, 35% మంది మహిళలు ఉన్నారు.