టి20 ప్రపంచకప్‌కు పొలార్డ్ దూరం
అంటిగ్వా: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా పేసర్ కీమర్ రోచ్‌ను కూడా ఎంపిక చేయలేదు. గాయాల నుంచి కోలుకోకపోవడంతోనే వీరిద్దరిని పరిగణనలోకి తీసుకోలేదని విండీస్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. 15 మంది సభ్యుల జట్టుకు డారెన్ స్యామీ నాయకత్వం వహించనున్నాడు.
వెస్టిండీస్ జట్టు: స్యామీ (కెప్టెన్), శామ్యూల్ బద్రీ, డ్వేన్ బ్రేవో, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, ఆండ్రీ ఫ్లెచర్, గేల్, నరైన్, రామ్‌దిన్, రాంపాల్, రస్సెల్, మార్లోన్ శామ్యూల్స్, కృష్మార్ సంతోకి, లెండిల్ సిమ్మన్స్, డ్వేన్ స్మిత్.