భారత్ ఖాతాలో 6 పతకాలు : ప్రపంచ వుషు చాంపియన్షిప్
భారత్ ఖాతాలో 6 పతకాలు
ప్రపంచ వుషు చాంపియన్షిప్
న్యూఢిల్లీ: ప్రపంచ వుషు చాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. మలేసియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ 2 రజతాలు, 4 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. మహిళల విభాగం 48 కేజీల కేటగిరీలో సనతోయి దేవి, 70 కిలోల కేటగిరీలో పూజ కదియాన్ రజతాలు గెలుచుకున్నారు. 60 కేజీల విభాగంలో సంధ్యారాణి దేవి, 75 కేజీ విభాగంలో రంజనా దేవి, 48 కేజీల కేటగిరీలో చంద్రలకు కాంస్య పతకాలు దక్కాయి.
పురుషుల విభాగంలో భారత్కు ఒక కాంస్యం లభించింది. 52 కేజీల కేటగిరీలో సంతోష్ కుమార్ సెమీస్లో ఓడి కంచు పతకం దక్కించుకున్నాడు. 2011లో టర్కీలో జరిగిన ఈ చాంపియన్షిప్లో భారత్కు 2 రజతాలు, 2 కాంస్యాలు లభించాయి.