Worried farmers
-
ఈ నామ్.. గందరగోళం
జమ్మికుంట(హుజూరాబాద్) : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మొదటి సారిగా పత్తి బస్తాలకు ఈ నామ్ పద్ధతిలో కొనుగోళ్లకు మంగళవారం అన్నిఏర్పాట్లు చేయగా మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ప్రధాన వ్యాపారులు ఎవరు ఆన్లైన్ కొనుగోళ్లకు ముందుకు రాలేదు. దీంతో బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ కొనుగోళ్లలో పాల్గొన్నారు. పోటీ లేక రైతులకు కనీస ధర లభించలేదని రైతులు వాపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 200 వాహనాల్లో రైతులు లూజ్ పత్తిని మార్కెట్‌కు తీసుకురాగా మార్కెటింగ్ శాఖ అధికారులు వాటికి వేలంపాటతో కొనుగోళ్లు జరిపారు. దీంతో గంట వ్యవధిలోనే లూజ్ పత్తి వాహనాలు మార్కెట్ యార్డు నుంచి వెళ్లిపోయాయి. బస్తాల్లో వచ్చిన పత్తికి మాత్రమే అధికారులు ఈ నామ్ పద్ధతి మొదలు పెట్టడంతో రైతులు మధ్యాహ్నం 1 గంటవరకు యార్డులో ఎదురు చూపులు తప్పలేదు. నామ్‌కు విరుద్ధంగా తూకాలు.. ఈ నామ్ పద్ధతిని అమలుకు శ్రీకారం చుట్టిన క్రమంలో మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ఆన్లైన్ కాకముందే యార్డులో అడ్తిదారులు కొందరు ధరలు నిర్ణయించి తూకాలు మొదలు పెట్టారు. దీంతో మార్కెట్ సూపర్వైజర్ గౌస్ తూకాలను నిలిపివేసి అడ్తిదారుల తీరుపై మండిపడ్డారు. నామ్ కొనుగోళ్లు ప్రారంభిస్తే ఎందుకు తుకాలు వేస్తున్నారని ప్రశ్నించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పొద్దంతా యార్డులో ఏలా ఉంటారని, లూజ్ పత్తి తీసుకువచ్చిన రైతులు అమ్మకాలు పూర్తిచేసుకుని మార్కెట్ బయటకు వెళ్తుంటే బస్తాల రైతులు ఏం పాపం చేశారని అడ్తిదారులు ప్రశ్నించారు. ఒక్క, బస్తా, రెండు బస్తాలు తీసుకు వచ్చిన రైతులు అన్లైన్ కోసం గంటల కొద్ది ఎదురు చూస్తారా అంటూ సూపర్వైజర్ను నిలదీశారు. దీంతో అడ్తిదారులు తూకాలను నిలిపివేసి ఈ నామ్ వరకు ఎదురు చూడక తప్పలేదు. ముందుకు రాని వ్యాపారులు.. మార్కెట్లో ఈ నామ్ అమల్లోకి రావడం...అందులో కేవలం బస్తాలకే అమలు చేయడంతో ప్రధాన వ్యాపారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో బీ టైపు వ్యాపారులు ఇష్టానుసరంగా రైతులు తీసుకువచ్చిన బస్తాల పత్తికి ఆన్లైన్లో ధరలు నిర్ణయించారు. క్వింటాల్‌కు రూ.4,170 పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 96 క్వింటాళ్ల పత్తిని బస్తాల్లో తీసుకరాగా బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ క్వింటాల్ పత్తికి గరిష్ట ధర రూ. 4,170 నిర్ణయించారు. మోడల్ ధర రూ. 3,900, కనిష్ట ధర రూ. 3,500 చెల్లించారు. -
నాట్లు.. పాట్లు
తణుకు, న్యూస్‌లైన్ : చలిగాలులు పెరిగారుు. మడుల్లోని నారు ఎదుగుదలను దెబ్బతీస్తున్నారుు. ఫలితంగా వరినాట్లు ఆలస్యమవుతున్నారుు. ఊడ్పులకు అదును దాటిపోతుండటంతో రానున్న రోజుల్లో సాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మడుల్లో 21నుం చి 30 రోజులపాటు పెరిగిన (రెండుమూడు ఆకులున్న) నారును చేలల్లో నాటుతారు. రాత్రి ఉష్ణోగ్రతలు 14-15 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గిపోవటం, పొగమంచు అధికంగా కురవడంతో నారు ఎదగటం లేదు. 21 రోజులు దాటినా మళ్లలోని నారు 15 రోజుల క్రితం వేసినట్టుగా ఉంటోంది. దీనిని చేలల్లో ఊడ్చితే నీట మునిగి కుళ్లిపోతుందనే భయంతో నాట్లు వేయడానికి రైతులు సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు నాట్లు వేసిన చేలల్లోని వరి సైతం సక్రమంగా ఎదగకపోవటంతో ఎక్కువ నారు ఉపయోగించాల్సి వస్తోంది. దీనివల్ల నారు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. సాధారణంగా రబీలో ఎకరం పొలంలో నాటడానికి 37నుంచి 50 కేజీల విత్తనాన్ని నారుపోస్తారు. 50 కేజీల విత్తనం వేసినా ఆ నారు ఎకరంలో నాటడానికి సరిపోవడం లేదు. పొంచివున్న సాగునీటి కష్టాలు జనవరి మొదటి వారానికల్లా వరినాట్లు పూర్తి చేస్తేనే రైతులు సాగునీటి ఎద్దడి నుంచి బయటపడగలుగుతారు. మార్చి 31నాటికి కాలువల కట్టివేస్తామని అధికారులు ప్రకటించారు. నాట్లు ఆలస్యమైతే సాగు చివరి దశలో నీటికి కొరత ఏర్పడుతుందని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తణుకు ప్రాంతంలో 75శాతం ఆయకట్టులో మాత్రమే వరినాట్లు పూర్తరుునట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. తూర్పువిప్పర్రు, కె.ఇల్లిందలపర్రు, తణుకు, దువ్వ, కంతేరు, కత్తవపాడు, రేలంగి, కొత్తపాడు, పొదలాడ, కొమ్మర, ఈడూరు తదితర ప్రాంతాల్లో నాట్లు పూర్తికాలేదు. మరో 10 రోజులకు గాని ఊడ్పులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. నాట్లు 20 రోజులపాటు ఆలస్యమవుతున్నాయని, కాలువలు కట్టివేసే విషయంలో ఇరిగేషన్ అధికారులు స్పష్టత ఇవ్వకపోతే ఆలస్యంగా ఊడ్చిన రైతులు ఇబ్బందిపడే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇస్తే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.