వర్షాల కోసం పూజలు
నర్సాపూర్ రూరల్: మండలంలోని నాగులపల్లిలో వర్షాల కోసం గ్రామస్తులంతా హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో లింగం మునిగే వరకు బిందెలతో నీళ్లు పోశారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సరైన వర్షాలు కురవక పోవడంతో తాగు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బోరుబావుల వద్ద అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయని చెప్పారు. శ్రావణం చివరి శనివారం కావడంతో మహిళలు సైతం గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగశ్రీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.