ఎయిరిండియా చెత్త రికార్డు
విమానంలో వెళ్లాలంటే ముందుగా ఏ విమానయాన సంస్థను ఎంపిక చేసుకోవాలన్నది అన్నింటికంటే ముఖ్యం. కేబిన్లు, సేవల నాణ్యతతో పాటు.. అసలు విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఫ్లైట్ స్టాట్స్ అనే సంస్థ ప్రతియేటా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మొత్తమ్మీద విమాన సర్వీసులు ఎన్నిసార్లు ఆలస్యం అయ్యాయి, రద్దయ్యాయి, లోపల సేవలు ఎలా ఉన్నాయనే వివిధ అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు. ప్రపంచంలో అత్యంత చెత్త విమానయాన సంస్థలుగా మొత్తం పదింటిని ఎంపిక చేస్తే.. వాటిలో మన ఎయిరిండియాకు మూడో ర్యాంకు వచ్చింది.
2016 సంవత్సరానికి అతి చెత్త విమానయాన సంస్థలు
10. హైనన్ ఎయిర్లైన్స్
9. కొరియన్ ఎయిర్
8. ఎయిర్ చైనా
7. హాంకాంగ్ ఎయిర్లైన్స్
6. చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్
5. ఏషియానా ఎయిర్లైన్స్
4. ఫిలిప్పైన్ ఎయిర్లైన్స్
3. ఎయిరిండియా
2. ఐలండ్ ఎయిర్
1. ఈఐ ఎఐ
2016 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు
10. కాంటాస్
9. టామ్ లిన్హాస్ ఏరియాస్
8. డెల్టా ఎయిర్లైన్స్
7. సింగపూర్ ఎయిర్లైన్స్
6. ఏఎన్ఏ
5. ఆస్ట్రియన్
4. ఖతార్ ఎయిర్వేస్
3. జేఏఎల్
2. ఐబీరియా
1. కేఎల్ఎం