‘కుస్తీ’మే సవాల్
పట్టుబడితే.. పతకమే..
కూలీల కొడుకులు కుస్తీల్లో మేటి
జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్న క్రీడాకారులు
కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాçÜం, సాధించాలనే తపన ఉంటే ఏ రంగలోనైనా రాణించవచ్చు. దీనికి నిదర్శనమే ఈ రెజ్లర్లు(కుస్తీ క్రీడాకారులు) రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారైనా.. ఆటల్లో మాత్రం వీరు ఆణిముత్యాలు. కష్టపడటమే కాదు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, శిక్షణ ఇచ్చిన గురువుకు పేరు తెస్తూ.. జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు.
– పిఠాపురం టౌన్
జాతీయస్థాయిలో రాణించాలి..
ఇతడి పేరు పెదపాటి వీరబాబు, ఊరు పిఠాపురం మండలం విరవాడ. కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. దిల్లీలోని జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలో పాల్గొని అండర్–19లో కాంస్యపతకం సాధించాడు. జార్ఖండ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. నంధ్యాల, మెదక్, చిత్తూరు, కాకినాడ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పలు పతకాలు సాధించాడు. జిల్లా స్థాయిలో అయితే ఏకంగా 40 పతకాలు అందుకున్నాడు. తన తల్లిదండ్రులు కూలీపనిచేస్తూ తనని చదివిస్తున్నారని జాతీయస్థాయిలో రాణించి మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను సుఖపెట్టడమే తన ఆశయమని వీరబాబు చెప్పాడు. – పెదపాటి వీరబాబు
ఇండియా క్యాంప్‌లో ఆడాలి..
రెజ్లింగ్‌లో జాతీయస్థాయి పోటీల్లో పతకం సాధించి ఇండియా క్యాంప్‌లో ఆడటమే తన ధ్యేయమని పిఠాపురం ఇందిరానగర్‌కు చెందిన దానం వినోద్‌కుమార్ తెలిపాడు. తండ్రి లేడు. తల్లిపోషణలో పెరుగుతున్న వినోద్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ ఓపె¯ŒS యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జాతీయస్థాయి కుస్తీపోటీల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇతడి పోరాట పటిమను చూసి తెలంగాణ తరఫున ఆడితే అవకాశం ఇస్తామని అక్కడ అసోసియేష¯ŒS సభ్యులు కోరడం విశేషం. అయితే మన రాష్ట్రం తరఫునే పోటీల్లో పాల్గొని కోచ్‌కు మంచి పేరు తెస్తానని చెబుతున్నాడు. పంజాబ్‌లోని లుధియానా, ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో వినోద్‌కుమార్ తన ప్రతిభను చాటుకున్నాడు. రాష్ట్రస్థాయిలో విజయవాడ, చిత్తూరు, నెల్లూరు, అనకాపల్లి, గుంటూరులో జరిగిన పోటీల్లో బంగారుపతకంతో పాటు వివిధ పతకాలు సాధించాడు. – దానం వినోద్‌కుమార్
ప్రతిభచాటుతున్న క్రీడాకారులెందరో..
రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరుస్తున్న కుస్తీ క్రీడాకారులు ఎందరో పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అందులో విరవాడకు చెందిన దారా అనిల్(17) కర్నూలు, గుంటూరు, అనంతపూర్, వైజాగ్‌లలో జరిగిన కుస్తీ పోటీల్లో పలు పతకాలు సాధించాడు. అదే గ్రామానికి చెందిన పల్లి సాయిబాబు(17) కర్నూల్, గుంటూరు, వైజాగ్, అనంతపురంలలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించాడు. ఇతని సోదరుడు పల్లి నానిబాబు(15) విజయవాడ, కాకినాడలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రజిత, కాంస్య పతకాలు పొందాడు. వీరంతా కూలీ కుటుంబాలు నుంచి వచ్చినవారే.
– దారా అనిల్, పల్లి సాయిబాబు, పల్లి నానిబాబు
కోచ్ ప్రోత్సాహం వల్లే
కోచ్ లక్ష్మణరావు ప్రోత్సాహం వల్లే కుస్తీపోటీల్లో ప్రతిభ చాటుకుంటున్నట్టు క్రీడాకారులు తెలిపారు. రెజ్లింగ్‌లో తలపడాలంటే మంచి ప్రోత్సాహం, ప్రత్యేకమైన మైదానం, పరికరాలు కావాలని తెలిపారు. కాకినాడలో రెజ్లింగ్ హాలు ఉన్నా రవాణాఖర్చులు లేకపోవడంతో సరైన మైదానంలో లేకపోయినా పిఠాపురంలోనే తర్ఫీదు పొందుతున్నట్టు తెలిపారు. కోచ్ ఆర్థికసాయం వల్లే ఈ స్థాయికి వచ్చినట్టు క్రీడాకారులు తెలిపారు.
ప్రోత్సాహం కరువు
రెజ్లింగ్ క్రీడకు ప్రోత్సాహం కరువైంది. క్రీడాకారుల కోసం పరితపించి వారిని తీర్చిదిద్దేవారు కరువయ్యారు. క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్నవారికే పదవులు ఇవ్వాలి. అప్పుడే క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది. పేరుకోసమే క్రీడలను నిర్వహించి తూతూమంత్రంగా చేతులుదులుపుకొనే సంప్రదాయం పోవాలి. కుస్తీపోటీలకు మంచి గుర్తింపు తెచ్చింది నెల్లూరు కాంతారావే. రాజమండ్రి, విజయవాడ, సామర్లకోట, తెలంగాణ జిల్లాల్లో కాంతారావు వల్లే కుస్తీ పోటీలకు ఊపు వచ్చింది. జిల్లాలో పిఠాపురం, రాజమండ్రి, మామిడికుదురు, కాకినాడ, సామర్లకోట, ఏలేశ్వరం, రావులపాలెం, ద్వారపూడిలలో రెజ్లింగ్ క్రీడాకారులు ఉన్నా.. పిఠాపురంలోనే వారి సంఖ్య అధికం.
– లక్ష్మణరావు, కోచ్, జిల్లా రెజ్లింగ్ అసోసియేష¯ŒS కార్యదర్శి