WTA premier tennis tournment
-
సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్ టైటిల్
ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్): భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఒస్ట్రావా ఓపెన్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో చైనా భాగస్వామి ష్వై జాంగ్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ సానియా–ష్వై జాంగ్ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్ కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–ఎరిన్ రౌట్లిఫ్ (న్యూజిలాండ్) జంటపై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన సానియా –ష్వై జాంగ్ జోడీకి 25,230 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో 34 ఏళ్ల సానియా తన కెరీర్లో 43వ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. చివరిసారి 2020 జనవరిలో హోబర్ట్ ఓపెన్‌లో నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గిన సానియా ఖాతాలో చేరిన మరో డబుల్స్ టైటిల్ ఇదే కావడం విశేషం. చదవండి: IPL 2021 RCB Vs MI:పొట్టి క్రికెట్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లి.. -
ముచ్చటగా మూడోసారి...
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో క్విటోవా 7–6 (8/6), 4–6, 6–3తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీని మూడుసార్లు గెలిచిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2011, 2015లలో కూడా క్విటోవా ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. విజేత క్విటోవాకు 11,90,490 యూరోల (రూ. 9 కోట్ల 58 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో సానియా జోడి
స్టట్గార్ట్: పోర్షె గ్రాండ్‌ప్రి డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్) -కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సానియా-కారా బ్లాక్ ద్వయం 6-2, 2-6, 10-4తో అంటోనియా లోట్నెర్-అన్నా జాజా (జర్మనీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. జంకోవిచ్ (సెర్బియా)-అలీసా క్లెబనోవా (రష్యా); సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడిల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సానియా జంట తలపడుతుంది. డబుల్స్ కెరీర్లో 30వసారి డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లోకి చేరిన సానియా 19 టైటిల్స్ సాధించి, 10 సార్లు రన్నరప్‌గా నిలిచింది.