WTA tennis tourney
-
ఛాంపియన్‌గా గార్సియా.. మౌరెస్మో తర్వాత తొలి ఫ్రాన్స్ క్రీడాకారిణిగా రికార్డు
టెక్సాస్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలినా గార్సియా చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ గార్సియా 7–6 (7/4), 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా (బెలారస్)పై గెలిచింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో అమెలీ మౌరెస్మో (2005లో) తర్వాత సింగిల్స్ టైటిల్ గెలిచిన రెండో ఫ్రాన్స్ క్రీడాకారిణిగా గార్సియా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన గార్సియాకు 15 లక్షల 70 వేల డాలర్ల (రూ. 12 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1,375 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా విజయంతో గార్సియా, సబలెంకా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాల చొప్పున మెరుగుపర్చుకొని వరుసగా నాలుగు, ఐదు ర్యాంక్‌ల్లో నిలిచారు. -
రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ రద్దు
మాంట్రియల్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సన్నాహకంగా జరిగే రోజర్స్ కప్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నమెంట్‌ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఆగస్టు 7 నుంచి 16 వరకు కెనడాలోని మాంట్రియల్లో జరగాల్సింది. అయితే కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కెనడా ప్రభుత్వం ఆగస్టు 31 వరకు ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ టోర్నీ నిర్వాహకులు ఈ ఏడాది టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
సానియా జంట వాకోవర్
న్యూఢిల్లీ: ఎగాన్ క్లాసిక్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండెవాగె (అమెరికా) జంట సెమీఫైనల్లో నిష్క్రమించింది. యాష్లే బార్డీ–కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) జోడీతో శనివారం బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన మహిళల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో సానియా–కోకో జంట బరిలోకి దిగకుండానే తమ ప్రత్యర్థి జోడీకి వాకోవర్ ఇచ్చింది. మరోవైపు లండన్‌లో జరుగుతున్న క్వీన్స్ క్లబ్ ఏటీపీ టోర్నమెంట్ సెమీఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 4–6, 5–7తో జూలియన్ బెనెట్యూ–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది.