సానియా జంట వాకోవర్‌ | sania mirza pair walk over from wta tennis tourney | Sakshi
Sakshi News home page

సానియా జంట వాకోవర్‌

Published Sun, Jun 25 2017 11:00 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

సానియా జంట వాకోవర్‌

సానియా జంట వాకోవర్‌

న్యూఢిల్లీ: ఎగాన్‌ క్లాసిక్‌ డబ్ల్యూటీఏ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–కోకో వాండెవాగె (అమెరికా) జంట సెమీఫైనల్లో నిష్క్రమించింది. యాష్లే బార్డీ–కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) జోడీతో శనివారం బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సానియా–కోకో జంట బరిలోకి దిగకుండానే తమ ప్రత్యర్థి జోడీకి వాకోవర్‌ ఇచ్చింది.

 

మరోవైపు లండన్‌లో జరుగుతున్న క్వీన్స్‌ క్లబ్‌ ఏటీపీ టోర్నమెంట్‌ సెమీఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జంట 4–6, 5–7తో జూలియన్‌ బెనెట్యూ–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement