ట్వీట్లతో ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే!
X's ads revenue programme: ట్విటర్ (x.com) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించారు. ట్విట్లతో డబ్బులు సంపాదించుకునే వెసలు బాటు కల్పించారు. ఇందుకోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్‌ను డెవలప్ చేశారు. దీని సాయంతో యూజర్లు ఎక్స్ డాట్ కామ్‌లో చేసే ట్వీట్లపై యూజర్ల ఎంగేజ్మెంట్ ఆధారంగా ఆయా కంపెనీల యాడ్స్ డిస్ప్లే కానున్నాయి. వాటికి అనుగుణంగా యూజర్లు మనీని ఎర్న్ చేయొచ్చు.
ఈ ఫీచర్‌పై ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించింది. కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ వినియోగించుకొని సోషల్ మీడియా(x.com) ఫ్లాట్‌ఫామ్‌లో నేరుగా డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో సైతం అందుబాటులోకి తెచ్చింది.
ఎక్స్.కామ్‌లో యూజర్లు డబ్బులు సంపాదించుకునేందుకు కావాల్సిన అర్హతలు
►ఎక్స్.కామ్‌లో యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్‌ను పొందాలంటే యూజర్లు ముందుగా ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాలి. లేదంటే ఎక్స్. కామ్ గుర్తింపు పొందిన సంస్థ ఉండాలి.
►మూడు నెలల లోపల యూజర్లు చేసిన ట్విట్లపై 15 మిలియన్ ఇంప్రెషన్స్ ఉండాలి.
►500 ఫాలోవర్స్ తప్పనిసరి.
►పైన పేర్కొన్న అర్హతలు ఉంటే యూజర్లు ఎక్స్.కామ్ నుంచి డబ్బులు పొందవచ్చు. ఇందుకోసం యూజర్లు వినియోగించే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లలో స్ట్రైప్ ఆప్షన్ తప్పని సరిగా ఉండాలి. స్ట్రైప్ అనేది ఓ సర్వీస్ మాత్రమే. ఈ స్ట్రైప్ సర్వీసుల్ని ఆయా బ్యాంక్‌లు, ఇతర ఫైనాన్షియ్ కంపెనీలు అందిస్తుంటాయి. ఈ స్ట్రైప్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఎక్స్. కామ్ యూజర్ల అకౌంట్లకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది.
►అంతేకాకుండా, అర్హులైన యూజర్లు కంపెనీ ప్రకటనల రాబడి వాటా నిబంధనల్ని కూడా పాటించాలి
►ఈ నిబంధనలలో క్రియేటర్ మానిటైజేషన్ ప్రమాణాలు, ఎక్స్.కామ్ నియమాలు ఉన్నాయి. సెట్టింగ్‌లలోని మానిటైజేషన్ ఆప్షన్‌ను యాక్సెస్ చేయడం ద్వారా వినియోగదారులు క్రియేటర్ సబ్స్క్రిప్షన్లు, యాడ్స్ రెవెన్యూ షేరింగ్ రెండింటికీ అప్లయ్ చేసుకోవచ్చు. ఇక, వినియోగదారులు యాడ్స్ రెవెన్యూ షేర్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారు ఎక్స్. కామ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోతారు.
ఎక్స్.కామ్‌లో సంపాదించిన డబ్బుల్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే
ముందుగా, ఎక్స్.కామ్‌లోని ట్విట్ అనే ఆప్షన్‌పై మోర్‌పై ట్యాప్ చేయాలి. చేస్తే మీకు మానిటైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సైడ్ మెనూలో ‘‘జాయిన్ అండ్ పే అవుట్ సెటప్’’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. ఈ సమయంలో ఎక్స్.కామ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు మరికొన్ని ఆప్షన్స్‌లో అడిగిన వివరాల్ని ఎంటర్ చేయాలి.
ఇదంతా పూర్తయితే వినియోగదారులు ఎక్స్. కామ్ క్రమం తప్పకుండా డబ్బులు చెల్లిస్తుంది. మినిమం 50 డాలర్ల ఉంటే ఎక్స్.కామ్ నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అర్హులైన యూజర్లు ప్రతినెల చివరి వారంలో పెమెంట్స్ను పొందవచ్చని ఎక్స్.కామ్ యాజమాన్యం పేర్కొంది.
చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్?