‘అమ్మా బొమ్మాళీ’ నటుడికి చైనాలో..
‘అమ్మా బొమ్మాళీ’ అంటూ అరుంధతి సినిమాలో పశుపతిగా అద్భుతంగా నటించిన సోనూ సూద్‌కు చైనాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన చారిత్రక పోరాటగాథ ‘.జవాన్ఝంగ్’ సినిమా చైనా తరఫున అధికారిక ఎంట్రీగా 89వ ఆస్కార్ పురస్కారోత్సవాల్లో పోటీపడనుంది.
తెలుగులో, హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సోనూ ‘జవాన్ఝంగ్’ సినిమాతో చైనా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హర్ష అనే పాత్రను సోనూ పోషించాడు. తాను ప్రధాన పాత్రలో నటించిన సినిమా చైనా తరఫున అధికారికంగా ఆస్కార్‌కు వెళుతున్న విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆస్కార్ వేడుకల్లో తమ చిత్రం ఈ అవార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హువో జియాంకి తెరకెక్కించిన ఈ సినిమాలో భారతీయ నటులు నేహా శర్మ, అలీ ఫజల్ తదితరులు నటించారు. అదేవిధంగా జాకీ చాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ’కుంగ్ఫు యోగ’ సినిమాలోనూ సోనూ సూద్ నటిస్తున్నాడు. చైనా అధ్యక్షుడు జింపింగ్ భారత పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్-చైనా ఉమ్మడిగా తెరకెక్కిస్తున్న మూడో చిత్రాల్లో ‘కుంగ్ ఫు చైనా’ ఒకటి కావడం గమనార్హం.