ఆయుధాలిస్తే అక్రమాలకు చెక్‌పెడతాం
నర్సాపూర్ : అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి ఆయుధాలు ఇస్తే అక్ర మాలను అడ్డుకుంటామని అటవీ శాఖ నిజామాబాద్ సర్కిల్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వై.బాబురావు పేర్కొన్నారు. సోమవారం ఆయన నర్సాపూర్ అటవీశాఖ రేంజ్ పరిధిలో పర్యటించిన అనంతరం నర్సాపూర్‌లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. రా త్రి పూట అడవుల్లో చెట్లు నరికివేతను, అక్రమ కలప రవాణను అడ్డుకునేందు కు ప్రయత్నించే సమయంలో తమకు సరైన ఆయుధాలు లేకపోవడంతో అక్రమార్కులు తమ సిబ్బంది, దాడులు చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రమా దాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా గతంలో నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తమ సిబ్బందిపై దాడులు జరిగినపుడు తమకు ఆయుధాలు ఇవ్వాలని కోరు తూ ప్రభుత్వానికి లేఖ రాశామ న్నారు. మహారాష్ట్రలో అటవీ శాఖకు ఆయుధా లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అటవీ శాఖ నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని మెదక్, నిజామాబాద్ జిల్లా ల్లో ఎంపిక చేసిన అడవుల్లో సుమారు 916 హెక్టార్లలో మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టామన్నారు.
హరితహారం కోసం కృషి
సీఎం కేసీఆర్ ప్రకటించిన హరితహా రం కార్యక్రమాన్ని విజయవంతం చే సేందుకు అటవీ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని బాబురావు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవసరమైన మొక్కలను పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.
అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు
నర్సాపూర్ మీదుగా రాత్రిపూట అక్రమంగా కలప రవాణా జరుగుతున్న వి షయాన్ని ఆయన దృష్టికి తీసుకవెళ్లగా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని బాబురా వు ప్రకటించారు. అక్రమ కల ప రవాణాను అడ్డుకునేందుకు మరో వాహనా న్ని రేంజ్‌కు కేటాయిస్తామన్నారు. అక్ర మ రవాణాను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాత్రి పూట ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అక్కడే ఉన్న మెదక్ డీఎఫ్ఓ సోనిబాల తదితర అధికారులను ఆదేశించారు.