Yadava
-
యాదవులది మహాభారతమంత చరిత్ర
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): యాదవ జాతికి మహాభారతమంత చరిత్ర ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఆదివారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆల్ ఇండియా యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర యాదవ అడ్వొకేట్స్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాయర్ల సంక్షేమానికి ప్రభుత్వం వంద కోట్ల నిధిని ఇచ్చిందన్నారు. యాదవులను ఆర్థికంగా ప్రోత్స హించడానికి ప్రభుత్వం గొర్రెల పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. తొలుత రూ.5 వేల కోట్లతో ప్రారంభిస్తే అది ఇప్పుడు రూ.11 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల కంటే ఎక్కువ భూమిని కలిగిన వారు యాదవులేనని అందుకే యాదవులంతా రైతుబంధు, రైతుబీమాను పొందుతున్నారని అన్నారు. జాతి గౌరవాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా కావాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాదవులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని చెప్పారు. ఆల్ ఇండియా యాదవ మహాసభ లీగల్ సెల్ అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, సుప్రీంకోర్టు న్యాయవాది రణభీర్ యాదవ్, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, మాజీ మంత్రి కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..గొల్ల, కురుమ జాతి అత్యధికంగా ఉన్న తెలంగాణ భారతదేశానికి దిక్సూచి కావాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వీటితో వేల కోట్ల సంపదను యాదవలు సృష్టించబోతున్నారన్నారు. పశువుల కోసం మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి తెలంగాణ నుంచే గొర్రెలు ఎగుమతి అయ్యే పరిస్థితి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తామని సీఎం తెలిపారు. అదే పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి కేవలం 7 గంటలే విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
బీసీలకు అన్నిరంగాల్లో అవకాశాలు: కేసీఆర్
-
‘సాక్షి’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో యాదవ వధూవరుల వివాహ పరిచయ వేదిక
హైదరాబాద్: యాదవ వధూవరుల వివాహ పరిచయ వేదిక అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్, రైతు బజార్ పక్కన, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. యాదవ సామాజిక వర్గంలో వివాహ సంబంధాలు చూసుకోవడం సులభతరం చేయడానికి ఈ పరిచయ వేదిక మీకు ఎంతో ఉపయోగకరం. తమ పిల్లల వివాహ సంబంధాల కోసం ఈ వేదికలో పాల్గొనాలనుకునే తల్లిదండ్రులు సెప్టెంబర్ 24వ తేదీలోపు సాక్షి కార్యాలయంలో వధూవరుల వివరాలు, ఫొటోతోపాటు రూ. 1800/–లు చెల్లించి నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో సెప్టెంబర్ 17, 2016 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి 10% డిస్కౌంట్ వర్తిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి వధూవరుల ఫొటో, వివరాలతో ఉన్న పుస్తకం అందిస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: హెడ్ ఆఫీస్ హైదరాబాద్: 9010203717, మహబూబ్‌నగర్: 9951602829, రంగారెడ్డి: 9912220386, మెదక్: 9010311161, నిజామాబాద్: 9951602935, ఆదిలాబాద్: 9951602888, కరీంనగర్: 9951602933, వరంగల్: 9951602872, నల్గొండ: 9505508382, ఖమ్మం: 9912220596.