విభజన జరిగితే అభివృద్ధి శూన్యం
భాకరాపేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి శూన్యంగా మారుతుందని ఎమ్మెల్సీ యుండపల్లె శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన స్వగ్రావుం చిన్నగొట్టిగల్లు వుండలం యుండపల్లెవారిపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లుకు సంబంధించి శాసనసభలో, శాసన వుండలిలో చేర్పులు, వూర్పులకు సూచనలు ఇచ్చావున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఎన్నికల వుుందు తీసుకొచ్చి హడావుడి చేసేయూలని కాంగ్రెస్ భావిస్తోందని వుండిపడ్డారు.
రాష్ట్ర విభజన ప్రజాప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలకోసమే అనే విషయం ప్రజలు గుర్తించారన్నారు. లక్షకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజెక్టులన్నీ పాక్షికంగానే పూర్తయ్యాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం దారుణమన్నారు. మన జిల్లాలో గాలేరు-నగరి, హంద్రీ-నీవా పనులు పూర్తి చేయలేదన్నారు. రాష్ట్ర విభజన అనివార్యం అరుుతే రాయులసీవు ప్రాంత జిల్లాలు అథోగతికి చేరుకుంటాయన్నారు.
కోస్తా ప్రాంత ంలో సైతం పంటలకు నీళ్లు ఉండవన్నారు. విద్యారంగానికి సంబంధించి తీరని సవుస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. యుువతకు ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాల ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్ట విభజనతో సమస్యలు మిగులుతాయే తప్ప అభివృద్ధి జరగదన్నారు.